యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. (కీర్తనలు 27:4)
మనము దేవుని నుండి వినాలని ఆశించినట్లైతే, మనము మన జీవితాల్లో ఆయనను వెదకుట ప్రాధాన్యతయై యున్నది. దావీదు ఈనాటి వాక్యంలో జీవితం యొక్క ఒక అవసరాన్ని సంగ్రహించాడు. అతను జీవితంలో ఒక ముఖ్యమైన అవసరంగా దేవుని ఉనికిని కోరుకున్నాడు.
విజయం సాధించడానికి మరియు విశ్వాసం పొందడానికి దావీదు అనేక అవకాశాలను పొందాడు.
దేవుని సన్నిధి ద్వారా బలపరచబడిన ఆ బాలుడు ఒక వడిసెల మరియు ఐదు చిన్న రాళ్లతో మరేమీ లేకుండా బలవంతుడైన యోధుడిని చంపాడు. దేవుడు పురుషులు గల కుటుంబములో చిన్న సహోదరుడైనప్పటికీ ఈ సాధారణ గొర్రెల కాపరి ఆ బాలుడిని ఇశ్రాయేలు రాజుగా ఎన్నుకున్నాడు. అతడు పొందుకున్న కీర్తి మరియు సంపద చాలా మంది ప్రజలు సంతృప్తిని ఇస్తాయని భావించే ప్రతిదాన్ని అందించాయి.
దావీదు అనేక విధాలుగా దేవుని సన్నిధిని అనుభవించిన తర్వాత కూడా అతడు దేవునిని మరెక్కువగా వెంబడించుట అనే అనుభవము ద్వారా మనకు కూడా ఎన్ని విజయాలను అనుభవించినా కూడా దేవునిని వెంబడిస్తూనే ఉండాలనే గ్రహింపును మనము పొందుకున్నాము. దావీదు కూడా దేవునిని మరింత సన్నిహితముగా తెలుసుకోవలసిన అవసరతను కలిగి యున్నాడు.
అనేక మంది ప్రజలకు దేవుని నడిపింపు అవసరమై యున్నది, కానీ దేవుని స్వరమును వినే ప్రక్రియలో వారు ఇతర విషయాలను ప్రక్కకు పెట్టాలనే జ్ఞానమును తెలుసుకోలేక పోతున్నారు. కానీ దావీదు – తన జీవితమంతటిలో దేవునిని ఎక్కువగా కోరుకొనుటలో – తాను కోరుకున్న ప్రతి విషయానికి ప్రాధాన్యతను తగ్గించాడు. నిన్నటికంటే ఈరోజు దేవునిని ఎక్కువగా తెలుసుకొనుటయనే ఒకే విషయం నిజముగా మనకు సంతృప్తి నిస్తుందని నేను నమ్ముతాను.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ జీవితంలో-ఈరోజు మరియు ప్రతిరోజు “దేవుని గురించి ఎక్కువ” ఆలోచించుట కొనసాగించండి.