యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. (కీర్తనలు 19:7)
దేవునితో మాట్లాడడం మరియు వినడం కంటే గొప్ప గౌరవాన్ని నేను ఊహించలేను మరియు ప్రార్థన మన జీవితంలో గొప్ప హక్కు అని నేను నమ్ముతున్నాను. ఇది మనం కేవలం చేసే పని కాదు; కానీ అది మనం చేయవలసిన పని. ప్రార్థన అనేది మన జీవితాల్లో మరియు మనం ప్రేమించే వారి జీవితాల్లో దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలు నెరవేరేలా చూడడానికి మనం దేవునితో భాగస్వామి అయ్యే మార్గం. భూమిపై ఉన్న మానవులమైన మనం వాస్తవానికి దేవుని అద్భుతమైన సన్నిధిలోకి ప్రవేశించడానికి ఇది సాధనం. ఇది మన హృదయాలను ఆయనతో పంచుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి మరియు ఆయన మన కోసం కలిగిఉన్న అన్ని గొప్ప విషయాలను ఎలా కనుగొని ఆనందించాలో తెలుసుకోవడానికి అనుమతిస్తుంది. దేవునితో సంభాషించడం (కమ్యూనికేట్ చేయడం) నిజంగా నేను ఆలోచించగలిగే గొప్ప ఆధిక్యత, కానీ ఈ ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన కార్యము మాత్రమే కాక నాకు తెలిసిన అతి సులభమైన అధికారం కూడా.
దేవునితో మాట్లాడటం లేదా ఆయన స్వరాన్ని వినడం అనేది ఎప్పుడూ సంక్లిష్టంగా ఉండేదని నేను నమ్మను మరియు మొదటి నుంచీ, మనం రోజంతా, ప్రతిరోజు ఆయనతో అనుసంధానించబడే సులభమైన, సహజమైన జీవన విధానంగా ఆయన ఉద్దేశించియున్నాడు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: ప్రార్ధన అనేది ఊపిరి వంటిది; స్వభావితముగా చేయండి మరియు దినమంతయు చేయండి.