ఒప్పుకోండి మరియు ప్రార్ధించండి

ఒప్పుకోండి మరియు ప్రార్ధించండి

మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. (యాకోబు 5:16)

పాపము మనలను దేవుని నుండి వేరుపరుస్తుంది. ఇది మనకు చాలా దూరంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది; ఇది మనలను ఆయన నుండి దాచాలని లేదా ఆయనతో మాట్లాడకూడదనుకునేలా చేస్తుంది; మరియు అది మనలను ఆయన స్వరాన్ని వినకుండా చేస్తుంది. మనం పాపం చేశామని మనకు తెలిసినప్పుడు, మనం దేవుని క్షమాపణ కోసం అడగాలి మరియు దానిని స్వీకరించాలి, ఎందుకంటే మనం పశ్చాత్తాపపడినప్పుడు ఆయన మనల్ని క్షమిస్థానని వాగ్దానం చేస్తాడు. దాచిన విషయాలు మనపై అధికారాన్ని కలిగి ఉంటాయి మరియు ఈనాటి వచనం ప్రకారం మన పాపాలను ఇతర వ్యక్తులతో ఒప్పుకోవడం చాలా ఉపయోగకరంగా ఉండే సందర్భాలు ఉన్నాయి.

మన తప్పులను ఎవరితోనైనా ఒప్పుకోవడం మరియు ప్రార్థన కోసం అడగడం అనేది ముందుగా మనం నిజంగా విశ్వసించే వ్యక్తిని కనుగొనడం మరియు రెండవది మన గర్వాన్ని పక్కనపెట్టి, మన కష్టాలను వినయంగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండటం అవసరం. మీకు అది సవాలుగా అనిపిస్తే, వినయంతో ఎదగడానికి మీకు సహాయం చేయమని దేవుడిని అడగండి, ఎందుకంటే మీరు విశ్వసించగల స్నేహితుడిని కనుగొంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మరియు మీరు ఆ వ్యక్తితో ఇలా పంచుకుంటారు, “నేను ఈ ప్రాంతంలో కష్టపడుతున్నాను మరియు నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నేను బాధ పడుతున్నాను మరియు మీరు నా కోసం ప్రార్థించాలి.”

స్నేహితుని పట్ల అసూయతో నిజంగా పోరాడినట్లు నాకు గుర్తుంది. నేను ప్రార్థించాను, కానీ ఇప్పటికీ అసూయతో బాధపడుతున్నాను కాబట్టి నేను దానిని డేవ్‌తో ఒప్పుకున్నాను మరియు నా కోసం ప్రార్థించమని అడిగాను. దానిని బహిరంగంగా బయటకు తీయడం నాపై దాని శక్తిని విచ్ఛిన్నం చేసింది మరియు నేను దాని నుండి విముక్తి పొందాను. ఎల్లప్పుడూ ముందుగా దేవుని దగ్గరకు వెళ్లండి, కానీ మీకు స్నేహితుడు లేదా ఆత్మీయనాయకుడి సహాయం అవసరమైతే, అహంకారం మీ మార్గంలో నిలబడనివ్వకండి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు పాపములను ఒప్పుకొనుట అవసరమైనప్పుడు గర్వము మిమ్మల్ని ఆపకుండా చూసుకోండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon