కొద్ది హెచ్చరికలను అనుసరించండి

కొద్ది హెచ్చరికలను అనుసరించండి

మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.   — యెషయా 30:21

పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ జీవితములో మనల్ని నడిపించాలని ఆశిస్తాడు, కానీ మనము పెద్ద విషయాల మీద మనస్సును ఉంచుటకు ప్రయత్నిస్తాము మరియు ప్రతి రోజు చిన్న మాటలు మన జీవితాల్లో ఎంతగా మాట్లాడతాయనే విషయాలను మనము గుర్తించము.

ఒక రోజు నేను మా ఇంటికి వెళ్ళే మార్గములో ఉన్నాను మరియు మద్యలో ఎక్కడైనా ఆగి ఒక కప్పు కాఫీ త్రాగాలని ఆశించాను, నేను నా సహాయకురాలిని పిలిచి ఆమెకు కూడా ఒక కప్పు కాఫీ కావలేమోనని అడగాలనుకున్నాను. నేను పిలిచినప్పుడు ఆమె, “నేను ఇక్కడ నిలబడి ఒక కప్పు మంచి కాఫీ త్రాగితే బాగుండును అని అనుకుంటున్నాను” అని చెప్పింది.

చుడండి, దేవుడు ఆమె హృదయ వాంఛను తీర్చాలని మరియు దాన్ని నా ద్వారా తీర్చాలని ఆశించాడు. నేను ఒక పెద్ద స్వరమును వినలేదు లేక ఒక దూతను చూడలేదు లేక ఒక దర్శనమును చూడలేదు. నేను కేవలం ఆమెకు ఒక కప్పు కాఫీ అందించాలని ఒక చిన్న ఆలోచనను మాత్రమే కలిగి యున్నాను.

అదే విధముగా, మీ జీవితములోని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని దేవుని స్వరమునకు చేవియోగ్గునట్లు మీ హృదయమును సిద్ధముగా ఉంచమని ప్రోత్సహిస్తున్నాను. చిన్న మాటలను అనుసరించండి. అయన మీ హృదయముతో మాట్లాడుతూ మీరు వెళ్ళ వలసిన త్రోవలోనికి మిమ్మును నడిపించును.

ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, మీ చిన్న హెచ్చరికలను వినునట్లు నన్ను నేను నిశ్శబ్ద పరచుకొనుటకు ఎన్నుకొని యున్నాను. నేను ఇతరులను ఆశీర్వదించునట్లు నాకు మార్గములు చూపుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon