గులాబీ రంగు అద్దాలు మరియు భూతద్దాలు

గులాబీ రంగు అద్దాలు మరియు భూతద్దాలు

కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? —రోమా 2:1

మనము ప్రతి ఒక్కరికీ ఏమైందని అలోచించి మాట్లాడుచున్నప్పుడు, మనము సాధారణముగా మన స్వంత గుణ లక్షణమునే మోసగించు కొనుచున్నాము. మనలో చాలా తప్పు ఉన్నప్పుడు ఇతరులకు ఏమైందని ఆలోచించ వద్దని యేసు ఆజ్ఞాపించాడు (మత్తయి 7:3-5).

మనము ఇతరులకు తీర్పు తీర్చుచున్నపుడు, మనము ఇతరులను ఎందులో తీర్పు తీర్చుచున్నామో అవే తప్పులు మనము కుడా చేసియున్నామని బైబిల్ స్పష్టముగా తెలియజేసియున్నది!

మనము కొన్నిసార్లు ఏదైనా పని చేసినప్పుడు మనకు అది చాలా పరిపూర్ణముగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అదే పని ఇతరులు చేస్తే వారిని ఎందుకు తీర్పు తీరుస్తాము అని ఒక్కసారి నేను దేవునిని అడిగి యున్నాను. ప్రభువు నా హృదయముతో ఇలా మాట్లాడాడు, “జాయిస్, నిన్ను నీవు గులాబీ రంగు అద్దాలతో చూస్తావు, కానీ ఇతరులందరినీ నీవు భూతద్దములో చూస్తావు” అని చెప్పాడు.
ఇది సత్యము! మన స్వంత ప్రవర్తనను గురించి మనము సాకులు చెప్తాము, కానీ ఇతరులు అదే పనిని చేసినట్లైతే మనము కొన్నిసార్లు కనికరము లేని వారి వలె ప్రవర్తిస్తాము.

ఈ ప్రక్రియను వ్యతిరేకముగా చేయాలని – అనగా ఇతరులలో ఉత్తమమును ఉహించండి, కానీ మీ స్వంత జీవితమును భుతద్దములో చూడండి. దేవుడు మీతో మొదటిగా వ్యవహరించమని అనుమతించండి మరియు ఇతరులు ఎదుగునట్లు మీరు ఆత్మీయ మార్గమును నేర్చుకుంటారు.


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, ఇతరుల జీవితములను పరీక్షించుట కంటే, నా జీవితమును నేను పరీక్షించు కొనవలెనని ఆశిస్తున్నాను. మీ సహాయముతో నేను కలిగియున్న సమస్యలను నేను సరిచేసుకొనగలను మరియు అలాగే ఇతరులు ఎదుగునట్లు అనుకూలమైన ఆరోగ్యకరమైన మార్గములను కనుగొంటాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon