శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. —యాకోబు 1:12
శోధనలు అర్థం చేసుకొనుట మరియు దూకుడుగా ప్రతిఘటించడం ద్వారా దయ్యం కంటే ఒక అడుగు ముందుగానే ఉండటానికి ఏకైక మార్గం అని నేను నమ్ముతున్నాను. యాకోబు 1:12 , శోధనను జయించువాడు ధన్యుడు… అతడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు…. శోధనను జయించడం అంటే, పట్టు వదలకుండా పరీక్షల ద్వారా వెళ్ళడం-దయ్యాన్ని అధిగమించడం.
భరించుట అంటే మీ వైఖరిని లేదా సమర్పనను మార్చుకొనుటకు అనుమతించకుండా శోధన సమయం గుండా వెళ్ళటం. యేసు శోధనకు గురైనప్పుడు ప్రజలతో ఎప్పుడూ భిన్నంగా ప్రవర్తించలేదు, మరియు మనం ఆత్మీయంగా పరిపక్వత చెందినప్పుడు, మనం ఆయన మాదిరిని అనుసరించవచ్చు.
శోధనలతో మనం ఎదుర్కొంటున్నదాన్ని యేసు సరిగ్గా అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆయన మనలను శోధనలను ఎదుర్కోవటానికి అనుమతిస్తాడు, తద్వారా మన జీవితంలో బలహీనముగ ఉన్న ప్రాంతాలకు ఆయన మన దృష్టిని తీసుకురాగలడు మరియు వాటిని అధిగమించడంలో మనకు సహాయపడతాడు. యేసు మీరు కోరుకున్నదానిని కలిగి ఉండుటకు ఏర్పరచిన ఏకైక మార్గం ఏమిటంటే, మిమ్మల్ని ఎవరుగా ఉండాలని సృష్టించాడో అలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు.
మరియు ఆ పరిపక్వత శోధనల ద్వారా వస్తుంది. కాబట్టి ఓపికపట్టండి మరియు దేవుని కృప ద్వారా శోధనలలో నిలబడగలరు. ఇది మిమ్మల్ని దయ్యం కంటే ఒక అడుగు ముందుకు వేయిస్తుంది.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్దాత్మా, నా శోధన సమయంలో మీరు నాతో ఉన్నారని నేను నమ్ముతున్నాను, కాబట్టి నేను సహనము కలిగి బలముగా నిలబడగలను, ఎల్లప్పుడూ దయ్యం కంటే ఒక అడుగు ముందుగా ఉండగలను.