అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన (సత్యమును అనుగ్రహించు ఆత్మ) ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును (సంపూర్ణ) సర్వసత్యములోనికి నడిపించును; —యోహాను 16:13
ఇది ఒక అందమైన పునాది వేసే అంశము లాగా ఉంటుంది, కానీ దేవుడు నిజంగా ప్రజలతో మాట్లాడతాడా అని ప్రశ్నించే వారు చాలా మంది ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మీరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడతాడా? జవాబు అవును అని తెలుసుకోవటానికి మీరు సంతోషంగా ఉంటారు.
ఈ యుగాంతమందు యేసు తన శిష్యులతో ఇలా చెప్పెను, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన జేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; (యోహాను 16:12-13).
యేసు ఈ మాటలు మాట్లాడినప్పుడు, ఆయన గడిపిన గత మూడు సంవత్సరాలు మనుష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు … అయినా ఆయన ఇంకా ఎక్కువగా బోధించవలసి యున్నది. ఇది ఆశ్చర్యకరమైనది, ఎందుకంటే నేను మూడు సంవత్సరాలు, పగలు మరియు రాత్రి నాతో వ్యక్తిగతంగా ఉంటే, నేను తెలుసుకోవలసిన ప్రతీది తెలుసుకుంటాను.
కానీ యేసు ఎల్లప్పుడూ చెప్పడానికి చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే మన జీవితంలో కొత్త పరిస్థితులను ఎల్లప్పుడూ ఎదుర్కొంటున్నాము, ఎందుకంటే ఆయన మనల్ని మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు, అందువల్ల ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయనతో మాట్లాడడాన్ని వినగలుగుతాము.
క్రీస్తు ద్వారా, మరియు పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి ద్వారా దేవుడు ప్రతి రోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన మీ కోసం కలిగియున్న మంచి విషయాల ద్వారా మీరు దశల వారీగా నడిపించబడాలని కోరుకుంటున్నారు.
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. (లూకా 11:13 చూడండి). మనలో ప్రతి ఒక్కరము దేవుని నుండి వినవచ్చు మరియు ప్రతిరోజూ పరిశుద్ధాత్మచే నడపించబడతామని మళ్ళీ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నీవు వింటున్నావా?
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలెనని అడుగుతున్నాను. మీరు నాతో మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను, నీవు ఏమి చెప్పాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.