
దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును (గుర్తించి చుపించుచు) మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. —2 తెస్స 3:5
మీ జీవితాన్ని అనేక ముడులతో ముడి పడియున్న విభిన్న రంగులతో ఉన్న కాలి మేజోళ్ళతో పోల్చుదాము. ప్రతి ముడిని ఒక సమస్యకు గుర్తుగా ఉన్నది మరియు ఆ ముడులను విప్పదీసి వాటిని నిలువుగా మార్చుటయనే ప్రక్రియకు కొంత సమయం మరియు పని అవసరమై యున్నది. ఆ ముడులన్నింటిని తీయుటకు చాల సమయం పట్టింది మరియు వాటిని నిలువుగా చేయుటకు మరి కొంత సమయం పడుతుంది.
మన ఆధునిక సమాజములో, మనము ఒక పని నుండి మరియొక పనికి మారుతూ ఉండుటకు ప్రయత్నిస్తాము, కానీ దేవుడు ఎప్పుడూ తొందరపడడు. ఆయన ఎప్పుడు సహనమును కోల్పోడు మరియు అందులోనుండి పారిపోడు. ఆయన ఒక ప్రత్యేకమైన విషయములో మనతో వ్యవహరిస్తాడు మరియు తరువాత మనకు కొంత సమయం వేచి యుండుటకు అనుమతిస్తాడు – కానీ ఎక్కువ సమయం కాదు. త్వరగా ఆయన మరలా తిరిగి వచ్చి మరియొక దాని మీద పని చేయునట్లు ప్రారంభిస్తాడు. మన ముడులన్నియు విడిపోవునంత వరకు ఆయన ఒక దాని తరువాత ఒకటి జరుగునట్లు కొనసాగిస్తాడు.
ఒకవేళ మీలో ఎటువంటి అభివృద్ధి కనపడకపోతే, దేవుడు ఒక్కొక్క ముడిని ఒక్కొక్కసారి తీస్తున్నాడని అర్ధము. ఆయన సహనము మీలో అభివృద్ధి చెందుటకు అనుమతించండి, త్వరగా లేక నిదానముగా మీ జీవితములో మీరు విజయాన్ని చూస్తారు మరియు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న స్వేచ్చను మీరు అనుభవిస్తారు.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు నా ముడులన్నిటిలో పని చేయుచు నా జీవితమును సుగమం చేస్తారని నేను ఆనందించుచున్నాను. మీరు నా జీవితములో విడువక పని చేయుచుండగా పట్టుదల మరియు సహనమును నేను అభివృద్ధి పరచుకొనునట్లు నాకు సహాయం చేయుము.