మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. —1 కొరింథీ 6:19
నేను 64 సంవత్సరములు వచ్చేంత వరకు నేను స్థిరముగా వ్యాయామం చేయలేదు లేక దానిని గురించి నేను పట్టించుకోలేదు. నేను కొంత నడిచాను మరియు నా శరీరము మంచి ఆకారములో ఉండునట్లు కొన్ని వ్యాయామములు చేశాను, కానీ నేను వ్యాయామం చేయుటకు నన్ను నేను ప్రతిష్టించుకోలేదు. నేను అనేక సంవత్సరములు నా సాకుల సంచిలో నేను వ్యాయామం చేయలేనని చెప్పే చాలా కారణములను వేసియున్నాను. కానీ దేవుడు నా హృదయముతో మాట్లాడియున్నాడు, మరియు నేను ఖచ్చితముగా వ్యాయామం చేయునట్లు నన్ను ప్రోత్సహించియున్నాడు కాబట్టి నేను నా జీవితములోని మూడవ వంతులో బలముగా ఉండగలుగుతున్నాను.
నాకు ఇప్పటికే మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి మరియు నేను దేవునికి విధేయత చూపి జిమ్ కు వెళ్ళడం ప్రారంభించినప్పుడు నేను నూతన జీవితములోనికి అడుగుపెట్టి యున్నాను. నేను ఇప్పుడు బాగుగా కనపడుతున్నాను, మంచి భావనను కలిగి యున్నాను మరియు అత్యంత ప్రాముఖ్యమైనదేమనగా దేవుడు నాకిచ్చిన శరీరమును గురించి శ్రద్ధ తీసుకొనుచూ దేవునిని మహిమ పరచుచున్నాను.
మీకు మీ జీవితములో ఈ ప్రాంతములో మీకు అభివృద్ధి అవసరమైతే ఆరోగ్యవంతమైన జీవిత శైలితో జీవించుట ప్రారంభిచుటను మీరు చేయవలసి యున్నది. మన దేహములు దేవుని ఆలయమని వాక్యము చెప్తుంది. మరియు దేవుడు ఈ దేవాలయమును ఇష్టపడతాడని నేను ఆశిస్తున్నాను! ఈరోజు మీ ఆలయమును దేవుని కొరకు మంచి రూపములో ఉండునట్లు చూచుకొనుడి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను మంచి శారీరక ఆరోగ్యముగల జీవితశైలిని కలిగి యుండుటకు ఎక్కువ సమర్పణ కలిగి యుండాలని ఆశిస్తున్నాను. నా ఆరోగ్యము క్రమపరచే మంచి ఎంపికలను కలిగి యుండునట్లు నాకు సహాయం చేయుము. నా దేహము మీ ఆలయమై యున్నది మరియు నేను దానిని మీ కొరకు శ్రేష్టమైన రూపములో ఉంచాలని ఆశిస్తునాను!