
…అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానము, అనేకులకు విస్తరించెను! —రోమా 5:15
దేవుడు మీరు ఎలా జీవించాలని పిలిచి యున్నాడో అలా జీవించుటకు దేవుని శక్తియే కృపయై యున్నది. ఏది ఏమైనప్పటికీ ఆయన చిత్తమునకు బయట జీవించుటకు ఆయన తన కృపను అనుగ్రహించలేదు. ఏది ఏమైనా దేవుడు చేయవద్దని చెప్పిన దేనినైనా చేయుటకు మనము నిర్ణయించుకొనిన యెడల మనం ఆయన అభిషేకమును పోగొట్టు కొనుట ద్వారా పొందిన బాధను అనుభవిస్తాము.
కృప సామర్ధ్యమునకు సమానముగా ఉంటుంది. దేవుని యొక్క పిలుపు మన జీవితములలో సరితూగునట్లు దేవుని కృపను అనుగ్రహించును. మన స్వంత పనులు మన స్వంత అంగీకారముతోనే చేస్తాము. మనము ఆయన నడిపింపును అనుసరించినట్లైతే మన పిలుపుకు తగినట్లుగా మనము జీవించుటకు దేవుడు తన కృపను మరియు బలమును అనుగ్రహించును.
ఉతమమైన భాగమేదనగా, మనము ఆయన కృపను పొందాలని ఎన్నుకొనిన యెడల దానిని సంపాదించుటకు మనము ఏమి చేయవలసిన అవసరం లేదు. మీరు దేవుని పిలుపును అనుసరించుటకు ఎన్నుకొనిన యెడల ఆయన మీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుదినము పరిశుద్ధాత్మ ఇచ్చే అనుమతితో దేవుని ఎదుట నీతిమంతులుగా నడచునట్లు మీ పాపములను కప్పుటకు యేసు సిలువలో మరణించి యున్నాడు.
ఈరోజు మీరు దేవుని కృప మరియు సామర్ధ్యమును పొందుకునే స్థానములో నిలిచియుండాలని అర్ధిస్తున్నాను. మీరు మీ స్వంత మార్గమును వెదకుటకు ప్రయత్నిస్తున్నట్లైతే మీరు దేవునిని అనుసరించాలని మరియు దానికి ఆయన సహాయం కావాలని ఆయనను అడగండి. ఆయన తన కృపను మీకు చూపుటకు ఎల్లప్పుడూ నమ్మకమైన వాడుగా ఉంటాడు.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, నా జీవితములో నీ కృప లేకుండా నేను విజయవంతముగా జీవించలేను. నేను నీ పిలుపును అనుసరించాలని ఆశిస్తున్నాను మరియు మీరు ఆశించిన రీతిగా ప్రతి దినము జీవించునట్లు నాకు సహాయం చేయుమని మిమ్మును ప్రార్ధిస్తున్నాను.