… తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు. —2 కొరింథీ 10:12
జన సమూహమును కాక దేవునిని అనుసరించుటకు ధైర్యము కావాలి. ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారనే విషయమును గురించి ఆలోచిస్తున్నట్లైతే అది మనలను వేదనకు గురి చేస్తుంది. మనమందరము బాగుగా ఆలోచించుటలో ఆనందించు చున్నప్పటికీ, అందరికీ ఇష్టులుగా ఉండుట అసాధ్యము.
దేవుని ఆర్ధిక వ్యవస్థలో మనము నిజముగా జీవితములో ఆశించిన దానిని పొందుటకు మనము కలిగి యున్న దానిని కోల్పోవుటకు సిద్ధంగా ఉండాలి, దీని అర్ధమేదనగా ఇతరుల జీవన ప్రమాణములతో పోల్చుకొని జీవించుటను ఆపి దేవుని కొరకు జీవించుట ప్రారంభించ వలెను.
దేవుడు మీరు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో అలా ఉండుటకు మీ నిజమైన స్నేహితులు మీకు సహాయపడతారు. దేవుని పిలుపును అనుసరించుటకు వారు నిన్నుతీర్పు తీర్చరు. నిజమైన స్నేహితులు మీ జీవితములో దేవునికి మొదటి స్థానమును ఇచ్చునట్లు మీకు సహాయ పడతారు.
ఒకవేళ ప్రతి ఒక్కరు మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ, ఆయన మిమ్మును ఎన్నడు విడువనని మరియు ఎడబాయనని వాగ్దానం చేసియున్నాడు.
మనము దేవునికి మరియు ప్రజలకు ఇష్టులుగా జీవించే జీవితము చాలా, క్లిష్టముగా, కలవరముగా మరియు నిరాశతో నిండి యుంటుంది. మిమ్మల్ని మీరు ఎవరితో పోల్చుకోనవసరం లేదు మరియు ఇతరులు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారని చింత పడనవసరం లేదు. దేవుని కొరకు జీవించండి మరియు మీరెలా ఉండాలని సృష్టించ బడ్డారో అలాగే జీవించుటకు స్వేచ్చగా ఉండండి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను నీ కొరకు మాత్రమే జీవిస్తానని నేను ఒక నిర్ణయము తీసుకున్నాను. ఇతరుల ప్రమాణముల నిమిత్తము మరియు వారు ఆశించే విధముగా జీవించుట నన్ను ఎక్కడికీ తీసుకెళ్ళదు. మీరు మాత్రమే నాకు ప్రాముఖ్యమైన వారు మరియు మీరు ఆశించిన విధంగానే జీవిస్తాను.