ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. —2 కొరింథీ 5:21
ఇక్కడ మిమ్మల్ని మీరు అడగవలసిన రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలున్నాయి:
క్రీస్తులో నేనెవరో నాకు తెలుసా?
నేను నీతిలో నడుస్తున్నానా?
అనేక మంది ప్రజలు ఈ ప్రశ్నలకు సరియైన జవాబు ఇవ్వలేరు, మరియు తద్వారా వారి కొరకు దేవుడేర్పరచిన స్వేచ్చ మరియు శాంతిలో జీవించుట నుండి ఆపుతుంది.
మనము ప్రభువైన యేసు క్రీస్తును మన స్వంత రక్షకుడుగా అంగీకరించిన మరు క్షణం నుండి దేవుడు మన పాపమును తీసివేసి ఆయన నీతిని మనకు అనుగ్రహించునని బైబిల్ చెప్తుంది. ఇది ఒక వరము మరియు మనము దానిని సంపాదించవలసిన అవసరం లేదు. కానీ మనము దానిని దరించవలసి యున్నది. మరియు మనము దానిని చేసినప్పుడల్లా ఆయన సమాధానమును మనము పొందుకుంటాము.
మీరు క్రీస్తులో ఏమైయున్నరనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, మీకు అవసరమైన దేవుడు మీకు ఎల్లప్పుడూ ఇచ్చే సమాధానము మరియు ఆత్మ విశ్వాసమును పొందుకుంటారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మరియు ఆయన మీ కొరకు మరణించి యున్నాడని మీరు తెలుసుకొనినప్పుడు ప్రతిరోజు మీరు నిద్ర లేచినప్పుడు దేవునిని ప్రేమించుటకు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన దానిని మీరు చేయగలరు.
మరియు మీరు క్రీస్తులో ఉన్నారని మీరు తెలుసుకొనినప్పుడు మీ కొరకు దేవుడు వెల చెల్లించి కొనిన దేవుని నీతిని ధరించగలరు మరియు అందులో నడవగలరు. మీ కొరకు ఆయన కలిగియున్న ప్రేమను అనుభవించినప్పుడు, మీ స్వాభావిక స్పందన ఎదనగా మీరు కలిగియున్న దానంతటితో మీరు ఆయన కొరకు జీవించగలరు.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను మీలో ఏమైయున్నానో అనే విషయాన్ని గురించి స్థిరముగా ఎరిగి యుండ వలెనని కోరుచున్నాను. మీరు నా కొరకు చేసిన సమస్తమును గురించి తెలుసుకొనుటకు సహాయం చేయండి తద్వారా, నేను అనుదినము మీ నీతిని ధరించుకొనగలను.