
… నీతిమంతులు (రాజీపడని) సింహమువలె ధైర్యముగా నుందురు. – సామెతలు 28:1
కొంతమంది ధైర్యమును బహిర్గతం చేస్తారు, ఇతరులు ధైర్యంగా దేవుని ప్రియమైన బిడ్డగా జీవిస్తున్నారు. దేవుడు నన్ను ధైర్యముగా జీవించటానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన తాళపు చెవులను చూపించే వరకు నేను ఆ సమస్యను కలిగి ఉన్నాను, మరియు నేను వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
- భయములో జీవించుటను తిరస్కరించండి. భయం అనునది మన సమాజంలో ఒక అంటువ్యాధి. భయములో నిలిచియుండకుండా విశ్వాసముతో జీవించమని హెబ్రీయులకు 10:38లో బైబిల్ మనకు ఉపదేశిస్తుంది.
- మీ లోపాలను మీ వెనుక ఉంచండి. మీరు క్రొత్త విషయాలను ప్రయత్నించినందున మీరు వైఫల్యం కాలేదు మరియు అవి పని చేయవు. మీరు ప్రయత్నించుట ఆపినప్పుడు మాత్రమే మీరు విఫలమవుతారు. తప్పులు చేసినప్పుడు భయపడకండి, మరియు మీరు ఇలా చేస్తే, త్వరగా కోలుకొని తిరిగి ముందుకు వెళ్తారు.
- పోల్చుకోవద్దు. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చినంత కాలం ధైర్యం అసాధ్యం. మీరు ఎవరు అనే విషయాన్నీ అంగీకరించడం ద్వారా ధైర్యం వస్తుంది మరియు మీరు ఉండవలసినంత ఉత్తమముగా ఉండగలరు.
- చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ హృదయాన్ని వెతకండి మరియు మీరు ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని మీరు నమ్ముతున్నారో మిమ్ములను మీరే అడగండి మరియు దానిని చేయండి.
ఈ నాలుగు తాళపు చెవుల గురించి ప్రార్థించండి మరియు అందులో మీరు నివసించునట్లు సహాయపడుటకు పరిశుద్ధాత్మను అడగండి. క్రీస్తులో, మరియు అయన కృప ద్వారా, మీరు ఆత్మ విశ్వాసమును కలిగి యుండి ధైర్యంగా జీవించవచ్చు.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మ, నా ధోరణుల లక్షణాలలో ధైర్యము కావాలి. మీ బలం ద్వారా ఈ నాలుగు తాళపు చెవులలో నేను బ్రతికేలా సహాయం చేయండి.