ఎవడైనను (ఒకరి భారములను ఒకరు భరించుట చాలా ప్రాముఖ్యమైనది) వట్టివాడైయుండి (తన స్వంతగా తాను ఎన్నిక చేసుకొనక) తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును. —గలతీ 6:3
బైబిల్ అనేకసార్లు మనకు గర్వమును గురించి హెచ్చరిస్తూ ఉన్నది. మరియు నేను గర్వము యొక్క అపాయమును నేను చాలినంతగా నొక్కిపలకలేను. చూడండి, మనము గర్వములో పడినప్పుడు, శతృవుకు మన మీద గొప్ప ప్రభావము చుపునట్లు స్థానమును ఇస్తున్నాము.
మనలను గురించి మనము చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లైతే, ఇతరులకు తక్కువ విలువకు దారితీస్తుంది, దేవునిని మరచి పోవునట్లు చేస్తుంది మరియు మనము దేవుడు లేకుండా ఉంటే మనము శూన్యమనే సత్యమును అలక్ష్యమును చేయుటకు దారి తీస్తుంది.
ఈ రకపు వైఖరి లేక ఆలోచన దేవునికి అసహ్యమైనది. మన గర్వము పరిశుద్ధ భయమై యుండవలెను మరియు మనము చాలా ప్రత్యేకమైన వారమని, విలువైన వారమని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన స్వంతగా మనము గొప్ప విషయాలను చేయునట్లు కాక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మరియు మనల్ని క్షమించాడు.
మనము ఏ విషయంలోనైనా ఉన్నతముగా ఉన్నట్లయితే దానిని చేయుటకు దేవుడు మనకు కృప అనే వరమును అనుగ్రహించియున్నాడని గుర్తు పెట్టుకోవాలి. మన స్వంత బలముతో మనము గొప్ప విషయాలని సాధించామని ఆలోచించిన మరు క్షణమే మనము గర్వములో పడిపోతున్నాము.
మనము దేవునికి చెందిన వారమని జ్ఞాపకముంచుకోండి. మనలను గురించి మనము అతిశయోక్తి ఆలోచనలను కలిగి యుండుట కంటే మనము దేవుని గొప్ప తనము మీద మరియు ఆయన మనల్ని ప్రేమించాడనే విషయం మీద దృష్టినుంచవలెను. ఇది కేవలం ఆయన దేవుడు మనకు ఏమి చేయాలని పిలిచాడో అందులో మనము విజయము సాధించుటకు కేవలం ఆయన కృపయే కారణమై యున్నది.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నాలో మరియు నా జీవితములో ఏదైనా మంచి జరుగుతుంటే అది మీ నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి, మీ ఎదుట నన్ను నేను తగ్గించుకొనుచు, నేను కలిగియున్న నా గర్వము విషయములో పశ్చాత్తాపపడుచూ, నేను పొందిన విజయాలకు మీ కృప మరియు మేలులే కారణమని నేను ప్రకటిస్తున్నాను.