నిన్ను గురించిన సత్యమును ఎదుర్కొనుము

నిన్ను గురించిన సత్యమును ఎదుర్కొనుము

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. – హెబ్రీయులకు 4:13

నా దౌర్జన్య భరితమైన గతము నుండి నేనెలా విడిపించబడతాను అని ఒకరు నన్ను అడిగారు. నా జవాబు చాల సులభమైనది: దేవుడు నాకు కృపను మరియు నా గురించిన సత్యమును ఎదుర్కొనుటకు అనుకూలమైన మనస్సును అనుగ్రహించియున్నాడు.

నేను కోపములో, నిశ్చలత లేని వాతావరణంలో పెరిగాను. నా త్వరిత కోపము వలన నేను దాదాపు అన్ని సమయాల్లో మనస్తాపం చెందుతాను. నేను మనస్తాపం చెందినందువలన నేను నిరుత్సాహం, నిస్తేజం మరియు మనశ్శాంతి లేకుండా పెరిగాను. నేను ఉత్తమ జీవితమును కలిగియుండాలని ఆశించాను కానీ ఆ కోరిక దేనినీ పరిష్కరించలేదు. నా సమస్యలు నా చెడ్డ కుటుంబ నేపధ్యం వలన నా సమస్యలను నిందించుటలో సమయాన్ని వృధా చేసియున్నాను.

చివరకు, నాకు జరిగిన దానికి నేను బాధ్యురాలిని కాను అని మరియు నా గతమును నేను మార్చలేనని తెలుసు కొనుటకు దేవుడు నాకు సహాయం చేసియున్నాడు మరియు నేను ఉన్న పరిస్థితి నుండి ముందుకు వెళ్ళుటకు సహాయం చేసియున్నాడు. నేను ఇతరులను మరియు పరిస్థితులను నిందించుట మరియు నా గురించి సాకులను చెప్పుట నేను ఆపి వేయవలెను. నేను దీనిని చేయుచుండగా నా జీవితమును స్వస్తపరచుమని మరియు సమకుర్పు పొందుటకు దేవుని మీద నమ్మకముంచియున్నాను కనుక నేను మారియున్నాను. ఇప్పుడు నేను సమాధానమును కలిగి జీవితములో ఆనందిస్తున్నాను.

మీరు ఇదే పరిస్థితిలో ఉండవచ్చు. మీ గురించిన సత్యమును గురించి తెలుసుకొనుట చాల భయంకరముగా ఉండవచ్చు కానీ మీరు దీనిని ఒంటరిగా చేయవలసిన అవసరం లేదు. మీ పొరపాట్లు దేవుని ఎదుట బహిర్గతమైనప్పుడు మరియు మీరు ఆయన దృక్ఫధము కొరకు అడిగినప్పుడు నిన్ను నీవు బలపరచుకోనుటకు, బాధ్యత వహించుటకు మరియు శాంతియుతమైన జీవితమును జీవించుటకు ఆయన మీకు సహాయం చేయును. ఈరోజు మీ గురించిన సత్యమును ఎదుర్కొనుటకు మీరు భయపడవద్దు కానీ ఒక నూతన రేపటి దినములోనికి మిమ్మును నడిపించుటకు దేవునిని అనుమతించండి.


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నా గురించిన సత్యమును ఎదుర్కొనుటకు మీ సహాయం నాకు అవసరము. నా గతములోని సమస్యలను మరియు ప్రజలను నిందించుట ఆపుటకు ఇదియే సమయం మరియు మీ వాక్యపు శక్తితో వాటిని ముఖాముఖిగా ఎదుర్కొంటాను. బాధ్యత తీసుకొనుటకు మరియు ఉత్తమమునకు మార్పు చెందుటకు బాధ్యత వహించుటకు నాకు సహాయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon