
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి (గుర్తించబడినది, దేవుని స్వంతమైనదిగా ముద్రించబడినది, సురక్షితమైనదిగా) యున్నారు. (ఎఫెసీ 4:30)
నేటి లేఖనం, దాని చుట్టూ ఉన్న వచనాల సందర్భంలో, మనం సంబంధాలను నిర్వహించే విధానం దేవునికి ముఖ్యమైనదని బోధిస్తుంది. వాటిని చెడుగా నిర్వహించడం అనేది మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఒక మార్గం.
చాలా సార్లు మనకు సమీపముగా ఉన్న వారితో చెడుగా ప్రవర్తించే అలవాటును పెంపొందించు కుంటాము, ప్రత్యేకించి మనకు బాగా అనిపించనప్పుడు; తగినంత నిద్ర రాకపోవడం; కష్టమైన రోజును అనుభవించడం, చెడు వార్తలను పొందుట లేదా నిరాశకు గురవడం. కానీ మనం ఒకరితో ఒకరు మంచిగా అనిపించినప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నేను నా భర్తతో లేదా పిల్లలతో ఎందుకు చెడుగా ప్రవర్తిస్తానని నన్ను నేను ప్రశ్నించుకుంటాను, కానీ ఇతరులతో కాదు. నేను ఆకట్టుకోవాలనుకునే వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు నా ప్రతికూల భావోద్వేగాలు మరియు వైఖరులను నేను నియంత్రించుకున్నానని పరిశుద్ధాత్మ త్వరగా నాకు చూపించాడు. కానీ నేను నా స్వంత కుటుంబంతో ఉన్నప్పుడు, నాకు అప్పటికే సంబంధాలు ఉన్నాయి, నా లోపాలను మరియు ఆత్మీయ అపరిపక్వతను స్పష్టంగా చూపించే స్వేచ్ఛను నేను తీసుకున్నాను. నేను నిజంగా నాకు సహాయం చేయలేనని, నేను చిరాకుగా లేదా కష్టంగా మారినప్పుడు, నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోలేనని నేను నమ్మాను. నేను చాలా నిరాశకు గురయ్యాను, నేను పేలవలసి (విస్పోటించు) వచ్చినట్లు అనిపించింది.
ఆర్థిక కష్టాలు, ఉద్యోగంలో లేదా ఇంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలపై ఏదైనా నేను కలత చెందినప్పుడు, నా నిరాశను నా కుటుంబంలోనికి తీసుకువెళ్లేదానిని. చాలా సార్లు నేను కోపంగా ఉన్నాను మరియు నాలో ఏదో పరిష్కారం లేని కారణంగా వారితో చెడుగా ప్రవర్తించాను, జరిగిన దాని వల్ల కాదు. సత్యాన్ని ఎదుర్కోవడానికి దేవుడు నాకు సహాయం చేసాడు మరియు కృతజ్ఞతగా నేను విడుదల చేయబడ్డాను.
సంబంధాలు అనేవి మనము కలిగియున్న గొప్ప ఆస్తులలో భాగము, మరియు మనం వాటికి విలువ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనకు చూపించే ఏ సత్యమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న హృదయంతో ఆయన వద్దకు వెళితే, మన చిరాకులను సరిగ్గా నిర్వహించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ అంతర్గత చిరాకులలో ఇతర వ్యక్తులు బాధ్యత తీసుకొనునట్లు చేయవద్దు.