ప్రార్ధించండి మరియు కృతజ్ఞత తెలపండి

ప్రార్ధించండి మరియు కృతజ్ఞత తెలపండి

ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను. (దానియేలు 6:10)

దేవుని స్వరాన్ని వినగలిగేలా కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం ఎందుకంటే, స్తుతి మరియు ఆరాధన వంటి వాటికి దేవుడు ప్రతిస్పందిస్తాడు. ఇది దేవునికి ఇష్టమైనది, ఇది ఆయన హృదయాన్ని ఆహ్లాదపరుస్తుంది. మనం ఎప్పుడైనా దేవునిని ఆనంద పరచినప్పుడు, ఆయనతో మన సాన్నిహిత్యం పెరుగుతుంది-మరియు అది ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

మనము కలిగి యున్న దానికి మనం కృతజ్ఞత చూపకపోతే, సణుగుటకు ఆయన మనకు ఇంకేమైనా ఎందుకు ఇవ్వాలి? మరోవైపు, మనం పెద్దవాటికి, చిన్నవాటికి యథార్థంగా మెచ్చుకోవడం మరియు కృతజ్ఞతతో ఉండడం దేవుడు చూసినప్పుడు, ఆయన మనల్ని మరింత ఎక్కువగా ఆశీర్వదించడానికి ఇష్ట పడతాడు. ఫిలిప్పీయులు 4:6 ప్రకారం, మనం దేవునిని అడిగే ప్రతిదానికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం దేని కోసం ప్రార్థించినా, ఎల్లప్పుడూ దానితో పాటు కృతజ్ఞత ఉండాలి. మన ప్రార్థనలన్నింటినీ కృతజ్ఞతతో ప్రారంభించడం మంచి అలవాటు. దీనికి ఉదాహరణ: “నా జీవితంలో మీరు చేసిన సమస్త మేలులకు ధన్యవాదాలు. మీరు అద్భుతంగా ఉన్నారు మరియు నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను మరియు మిమ్మల్ని ఘనపరుస్తున్నాను.”

మీ జీవితాన్ని పరిశీలించమని, మీ ఆలోచనలు మరియు మీ మాటలపై శ్రద్ధ వహించాలని మరియు మీరు ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నారో గమనించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీకు ఛాలెంజ్ కావాలంటే, ఒక్క ఫిర్యాదు కూడా చెప్పకుండా రోజంతా గడపడానికి ప్రయత్నించండి. ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి. నిజానికి, కేవలం విపరీతమైన కృతజ్ఞతతో ఉండండి-మరియు దేవునితో మీ సాన్నిహిత్యం పెరుగుతున్నప్పుడు మరియు ఆయన మునుపెన్నడూ లేనంత గొప్ప ఆశీర్వాదాలను కురిపించడాన్ని గమనించండి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: కృతజ్ఞతా వచనమే పలకండి కానీ ఫిర్యాదు మాటలు కాదు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon