
ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను. – ఫిలిప్పీ 3:12
చాల మంది ప్రజలు తాము పొరపాటులను చేస్తామనే భయముతో ఏమీ చేయకుండా ఉంటారు. బదులుగా, నేను తప్పు చేస్తే ఏమవుతుంది? నేను దేవునిని వదిలిపెడితే ఏమవుతుంది? అని చెప్తూ ఉంటారు.
ఒకసారి దేవుడు నాతో ఏమి చెప్పి యున్నాడో మీకు తెలుసా? “నీవు నన్ను వదిలిపెట్టినట్లితే, నేను నిన్ను పట్టుకుంటాను.”
మనము ఎక్కడో తిరుగుతూ మనమెక్కడ ఉన్నామో మనకు తెలియనప్పుడు, మనము కేవలం మన చేతులెత్తి “యేసూ, నీవు వచ్చి నన్ను పట్టుకొనుము! నేను కలవరముతో ఉన్నాను. నేను తప్పు నిర్ణయము తీసుకున్నానని అనుకుంటున్నాను.” అని చెప్పవచ్చు.
మనము పరిపూర్ణులము కాదని దేవునికి తెలుసు కాబట్టి అయన తన కుమారుని మన కొరకు పరిపూర్ణ బలియాగముగా అర్పించుటకు ఆయనను పంపి యున్నాడు. ఇప్పుడు మనము పరిపూర్ణత వైపు నడచుచున్నాము. ఫిలిప్పి 3 లో వెనుక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడమని అపోస్తలుడైన పౌలు చెప్పు చున్నాడు.
ముందునున్న వాటి కొరకు వేగిరపాడమని దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. పొరపాట్లు చేయుటయనే భయములో జీవించుట మానివేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు చేయవద్దని దేవుడు మిమ్మల్ని అడగటం లేదు. అయన మిమ్మలని నడిపించునట్లు అయన యందు నమ్మిక యుంచునట్లు మీరు ముందుకు సాగవలేనని అయన పిలుచుచున్నాడు. ఆయనకు మొర్రపెట్టమని అయన కోరుతున్నాడు. మీ అసంపూర్ణతయనే భయములో జీవించవద్దు. దేవుడు మీకోరకు కలిగియున్న పరిపూర్ణ ప్రణాళికతో విశ్వాసముతో జీవించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా అసంపూర్ణత మరియు పొరపాట్ల భయముతో జీవించాలని నేను ఆశించుట లేదు. నీ మీద దృష్టి యుంచునట్లు నాకు సహాయం చేయుము. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, సంపూర్ణతయనే గుర్తు వైపు సాగుటకు మీరు నాకు సహాయపడతారని నాకు తెలుసు.