
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. —హెబ్రీ 4:12
బైబిల్ చదవడం ఎక్కడ నుండి ప్రారంభించాలనే విషయం గురించి ప్రజలు నన్ను అడిగినప్పుడు ప్రారంభించుటకు ఎక్కడా తప్పు ప్రదేశం లేదని చెప్తాను. మీరు దేనిని చదివినా అది మీకు సహాయం చేస్తుంది.
నేను మొదటిగా వాక్యమును అధ్యయనం చేయుట ప్రారంభించినప్పుడు, నాకు సరియైన సంబంధాలు లేవు గనుక ప్రేమ అనగా ఏమిటో నేను సరిగా అర్ధం చేసుకోలేక పోయాను. కాబట్టి నేను ప్రేమ అను విషయాన్ని గురించి అధ్యయనం చేసియున్నాను మరియు నేను కేవలం దాన్ని ఒక భావనగానే భావించాను. ఇది మీరు ప్రజలను ఏ విధంగా చూడబోతున్నరనుటకు ఇది ఒక నిర్ణయమై యున్నది.
బైబిల్ ప్రేమను గురించి ఏమి చెప్తుందో దానిని అధ్యయనం చేసినప్పుడు నేను ప్రేమను గురించి నేర్చుకున్నాను. అప్పుడు నా జీవితం మారుట ప్రారంభమైనది.
మీరు దేనితో వ్యవహరిస్తున్నా, మీరు గ్రంధాలను (కంకర్దేన్స్) ఉపయోగించుట ద్వారా మీరు లేఖనములను కనుగొనవచ్చును. ఉదాహరణకు, మీరు కోపము లేక భయముతో వ్యవహరిస్తున్నట్లైతే, మీరు బైబిల్ చివరలో ఉన్న కంకర్దేన్స్ ను తిప్పి ఆ విషయాలకు సంబందించిన లేఖనములను కనుగొనండి. పరిశుద్ధాత్మ మిమ్మును నడిపించుటకు మరియు సత్యమును మీకు బయలు పరచుటకు దేవునిని అడగండి.
మీరెక్కడ ప్రారంభించినా, వాక్యము సజీవమైనదని మరియు దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, దేవా నీవు నాతో మాట్లాడతావని నాకు తెలుసు. ఈరోజు మీ వాక్యమునుండి నాకు అవసరమైన జ్ఞానమును మరియు శక్తిని కనుగొనుటకు నాకు సహాయం చేయండి.