మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. – యాకోబు 1:4
నేను మరియు నీవు దేవునితో, “నన్ను మార్చుము” అని చెప్పినప్పుడు, మనలను మార్చుటకు మనము చేసిన ప్రయత్నములు ఫలించలేదని మనము అర్ధము చేసుకోనవలసి యున్నది. బదులుగా, మనము మార్చబడునట్లు ఒక స్థానము ద్వారా ఒక అవకాశమును దేవుడు ఇవ్వబోతున్నాడు.
యాకోబు 1 మనకు తెలియజేయునదేమనగా, మనము మార్పు పొందుచున్నప్పుడు మరియు స్థానమును మరియు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు ఓర్పును కలిగి యుండుట ఎంత ప్రాముఖ్యమైనది తెలియజేయుచున్నాడు. సహనము అనునది ఒక ఆత్మ ఫలమై యున్నది మరియు అది శోధనలో ఎదుగుతుంది మరియు అది మనకు అవసరమై యున్నది. మనము దానిని కలిగి యున్నప్పుడు మనము పరిపుర్ణులుగా ఉంటామని మరియు ఏ కొదువ ఉండదని లేఖనములు తెలియ జేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ దేనినైనా పొందుటకు ఎదో ఒక దాని గుండా వెళ్ళుట తప్ప మార్గమేదియు లేదు.
దేవునిని సేవించే మరియు లోకములో మార్పును కలిగించే విజయవంతమైన క్రైస్తవులుగా నిజముగా ఉండాలని ఆశించి నట్లైతే, మనము కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటాము. సాతానుడు పొందే ప్రతి అవకాశము ద్వారా మిమ్మల్ని నిరుత్సాహ పరచుటకు ప్రయత్నిస్తాడు, కనీ మీ శత్రువు కంటే దేవుడు గొప్పవాడు మరియు ఏ సవాలు నుండియైన ఆయన మిమ్మల్ని విజయవంతులుగా నడిపిస్తాడు.
కాబట్టి ఈరోజు, వ్యతిరేక పరిస్థితిలో కూడా దేవుడు మీ ద్వారా పని చేయునట్లు ఎన్నుకోండి. మీ సహనము ఎదుగుతూ అభివృద్ధి చెందుతుండగా, మీరు గొప్ప విజయమనే జీవితములోనికి అడుగు పెడతారు.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నన్ను మార్చమని అడుగుతున్నాను అనగా నేను సవాళ్లలో నుండి వెళ్ళవలసి యున్నది. నేను శోధనలలో గుండా వెళ్తుండగా నేను విజయము పొందుటకు నాకు సహాయం చేయుము తద్వారా, నేను సహనమును కలిగి యుండి క్రీస్తులో పూర్తిగా అభివృద్ధి పొందగలను.