మీరు తెలుసుకోవలసిన సమస్తమును దేవుడు మీకు చెప్తాడు

మీరు తెలుసుకోవలసిన సమస్తమును దేవుడు మీకు చెప్తాడు

ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. (యోహాను 4:25)

దేవుని నుండి వినడాన్ని నేర్చుకొనుట మరియు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట అనునది ఒక ఉత్తేజవంతమైన సాహసం. మీ జీవితములో మీరు ఆనందించుటకు, ఆశీర్వదించబడుటకు, జ్ఞానయుక్తముగా ఉండుటకు మరియు ఆయన మీ యెడల కలిగియున్న ప్రణాళికలను నెరవేర్చుటకు అవసరమైన దానిని గురించి దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మేలుగా మరియు సహాయకరంగా ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ కొన్నిసార్లు దేవుడు తమతో మాట్లాడుతున్నాడని గుర్తించడంలో విఫలమైనందున ప్రజలు ఈ విషయాలను తెలుసుకోలేక పోతారు. ఆయన స్వరాన్ని వినడం మరియు పాటించడం ఎలాగో వారు నేర్చుకోవాలి.

ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లవేళలా మాట్లాడతారు, కాబట్టి మన పరలోకపు తండ్రి మనతో ఎందుకు మాట్లాడరు? మానవ తలిదండ్రులు తమ పిల్లలకు చెప్పకపోతే ఏమి చేయాలో తెలుసుకోవాలని ఆశించరు మరియు దేవుడు తన పిల్లలపట్ల కూడా అలాగే భావిస్తాడు. జీవితంలో మనం తెలుసుకోవలసినవన్నీ చెప్పాలనుకుంటున్నాడు.

మనము తరచుగా మన స్వంత మార్గంలో వెళ్లాలని కోరుకుంటాము, తద్వారా మనం ఏమి చేయాలనుకుంటున్నామో, మనం చేయాలనుకున్నప్పుడు చేయవచ్చు. కానీ, మనం ఈ విధంగా జీవించినప్పుడు, మనం మన మార్గమును కోల్పోయి, మన జీవితాలను వృధా చేసుకుంటాము. భూమిపై మన సమయంలో ప్రతి రోజు ద్వారా మనకు మార్గనిర్దేశం చేయడానికి మనకు పరిశుద్ధాత్మ అవసరం, మరియు మనతో మాట్లాడటం ద్వారా మరియు మనం తెలుసుకోవలసిన ప్రతివిషయాన్ని చెప్పడం ద్వారా ఆయన అలా చేయడానికి కట్టుబడి యున్నాడు.

ఈరోజు మీ కొరకు దేవుని మాట: 24-7 మీలో ఉన్న పరిశుద్ధాత్మలో మీరు మార్గదర్శిని మరియు ఆదరణకర్తను కలిగియున్నాడు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon