
బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. —జెకర్యా 9:12
మీ కొరకు నా వద్ద ఒక ప్రశ్న కలదు: మీరు దేనిని గురించి నిరీక్షణ కలిగి యున్నారు? మీరు జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మీరు మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలని ఆశిస్తున్నారా లేక మీరు నిరుత్సాహపడవలెనని ఎదురు చూస్తున్నారా?
ఈ రోజుల్లో చాల మంది ప్రజలు నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనము నిరాశగా జీవించుటకు యేసు మన కొరకు మరణించలేదు. మనము పూర్తి నిరీక్షణ కలిగి యుండాలని అయన మన కొరకు మరణించాడు.
సాతానుడు మన నిరీక్షణను దొంగిలించాలని ఆశిస్తున్నాడు మరియు అతడు మీతో అబద్ధమాడుచున్నాడు. మీ జీవితములో మంచి ఏదియు జరగదని మీతో చెప్తాడు లేక మీరు ఆశించిన మంచి విషయాలు నిలిచి యుండవని చెప్తాడు. మీరు కష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఆ పరిస్థితులు మారవని వాడు మీతో చెప్తాడు. కానీ పూర్తి నిరీక్షణతో నిండి యుండండి మరియు సాతానుడు ఒక అబద్దీకుడని జ్ఞాపకముంచుకోండి. దేవుడు సమస్తమును మార్చగలడు!
మన తండ్రి చాల మంచివాడు, మరియు అయన మీ జీవితములో మంచి ప్రణాళికలను కలిగియున్నాడు. మీరు మీ నిరీక్షణతో వ్యవహరిస్తున్నప్పుడు, మీ అనిశ్చిత మరియు కష్ట సమయాల్లో మీ సమస్యలకు రెట్టింపు ఆశీర్వాదాన్నిస్తానని ఆయన వాగ్దానం చేసియున్నాడు. కాబట్టి నిరీక్షణను విడిచిపెట్టుట నిరాకరించండి. దేవుడు ఏదైనా చేస్తాడని – ఏదైనా మంచిని చేస్తాడని ఎదురు చూడండి!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, మీలో నిరీక్షణను కలిగి యున్నాను. సాతానుడు ఒక అబద్దీకుడు మరియు నేను అతనికి చెవి యోగ్గను మరియు నిరీక్షణను కోల్పోను. నా జీవితంలో మీరు మంచి చేయాలని ఆశిస్తున్నాను.