మీరు నమ్మే ప్రజల ఎదుట మీ తప్పులను ఒప్పుకోండి

మీరు నమ్మే ప్రజల ఎదుట మీ తప్పులను ఒప్పుకోండి

తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు. —లూకా 8:17

చాలా మంది ప్రజలు తమ తప్పులను మరియు పొరపాటులను గురించి మాట్లాడుటకు సౌకర్యముగా ఉండరు. మనమెందుకు ఆ విషయాలను బహిర్గతము చేయుటకు ఇష్టపడము? ఎందుకనగా ప్రజలు ఏమనుకుంటారోనని ఆలోచిస్తాము. మనం త్రుణీకరింపబడతామని, అపార్ధం చేసుకోబడతామని లేక మనము ప్రేమించే వారి చేత ప్రేమించ బడమని మరియు మన గురించి వారు వేరే అభిప్రాయము కలిగి యుంటారని భయపడతాము.

కానీ మన పాపములను ఒప్పుకొనుట అనునది మన ఉద్రేకపరమైన స్వస్థతకు ప్రాముఖ్యమైనది. దాచబడిన విషయాలన్నీ బహిర్గతమవుతాయి కాబట్టి, మనము మన గాయములను మరియు బలహీనతలను మనము నమ్మే వారితో ఈరోజు పంచుకుందాము.

చివరకు నా గతములో నేను ఎదుర్కొన్న దుర్వినియోగం గురించి ఎవరితోనైనా పంచుకునే ధైర్యాన్ని నేను పెంచుకున్నప్పుడు, మానసికంగా చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను నా గతం గురించి మాట్లాడేటప్పుడు, నేను వేరొకరి సమస్యల గురించి మాట్లాడుతున్నాను. నా జీవితంలో నొప్పి మరియు బలహీనతలను అంగీకరించే ప్రక్రియ ద్వారా స్వస్థత మరియు పునరుద్ధరణను కలిగించింది.

మీరు నమ్మదగిన వారిని చూపించమని దేవునిని ప్రార్ధించి అడగండి, మరియు వారితో మీరు మీ సమస్యలను పంచుకొనే సంబంధములోనికి వచ్చునట్లు మిమ్మును మీరు సమర్పించుకోండి. మీరు వారితో పంచుకొనుచుండగా మీరు ఒకరికొకరు దేవుని స్వస్థతను పొందుకొనగలరు.


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధాత్మా, నేను నా తప్పులను, బలహీనతలను మరియు గాయములను పంచుకొనునట్లు నా జీవితములో నీవు ఉంచిన మనుష్యులను నాకు చూపించండి. నేను నా జీవితములో మరియు వారి జీవితములో గొప్ప స్వస్థతను చూడాలని ఆశించుచున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon