కాగా ఎవడైనను క్రీస్తు (మెస్సీయ)నందున్నయెడల వాడు (పూర్తిగా) నూతన సృష్టి …… —2 కొరింథీ 5:17
నేను నా జీవితంలో తప్పులు చేశాను – భవిష్యత్తులో నేను తప్పులు చేస్తానని నాకు ఖచ్చితంగా తెలుసు – కాని ఇప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నాను. వాస్తవం ఏమిటంటే, నేను అన్నింటినీ సరిగ్గా చేయను, కాని అది నేను క్రీస్తులో ఉన్నపరిస్థితిని ప్రభావితం చేయదు. నేను ప్రేమించ బడుతున్నానని నాకు తెలుసు మరియు నేను ఇంకా మంచి వ్యక్తిని. క్రీస్తులో నూతన సృష్టిని కావడం వల్ల, నా “చేయుట” నుండి నా “ఎవరు” ను వేరు చేయడం నేర్చుకున్నాను.
మీ “చేయుట” అనునది మీరు “ఎవరు” అను దానిని నిర్ణయించదని మీరు గ్రహించినప్పుడు, మీరు అవమానము నుండి కొత్త స్థాయిలో స్వేచ్ఛను అనుభవించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని మీకు తెలిసినప్పుడు, మీరు ఆరోగ్యకరమైన, సమతుల్య పద్ధతిలో మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభించవచ్చు. మీరు మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభించినప్పుడు, ఇతర వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు ఇష్టపడటం అంటే మీరు గర్వంతో నిండి యుండుట కాదు; దేవుడు మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు అంగీకరించారని దీని అర్థం.
మనందరికీ మన ప్రవర్తనలో మార్పులు అవసరం, కాని మనల్ని దేవుని సృష్టిగా అంగీకరించడం మానసికంగా ఆరోగ్యంగా మరియు క్రీస్తులో సంపూర్ణంగా మారడంలో మన అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. -మనల్ని ఇష్టపడటం- అనే ఈ ఒక విషయాన్ని మనం నేర్చుకోగలిగితే ఇది అవమాన ఆధారిత స్వభావాన్ని అధిగమించడంలో మనకు సహాయపడుతుంది.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, నా “ఎవరు” నుండి నేను “చేయుట”ను వేర్పరచుటకు నాకు సహాయం చేయుము. నన్ను నేను ఇష్టపడతాను మరియు నా అవమానము నుండి నేను స్వేచ్చను అనుభవిస్తాను ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు మరియు మీరు నా జీవితములో స్థిరముగా పని చేయుచున్నారు.