క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. —కొలస్సీ 3:15
మనమందరమూ ఉద్రేకములను కలిగియుంటాము మరియు అవి ఇక్కడ నిలిచి యుంటాయి. ప్రతి విశ్వాసిలో ఉద్రేకములలో స్థిరత్వము కలిగి యుండాలని నేను నమ్ముతాను. మన ఉద్రేకములు మనలను వ్యవహరించుటకు అనుమతించుట కాకుండా వాటిని ఎలా వ్యవహరించాలో నేర్చుకొనుటకు మనము దేవునిని వెదకాలి.
దీనిని గురించి ఆలోచించండి: మీకు అవసరమైన ఒక వస్తువు కొనడానికి మీరు ఒక షాప్ కు వెళ్లారు. మీరు దేవునితో అప్పు నుండి బయట పడతానని వాగ్దానం చేసియున్నారు, మరియు మీరు ఖర్చు పెట్టిన దానిని చూడాలని ఆశించారు మరియు మీకు అనవసరమైన వాటిని కొనలేదు. కానీ మీరు షాపింగ్ చేసేటప్పుడు అందులో 50% డిస్కౌంట్ సేల్ ఉందని తెలుసుకున్నారు? మీరేమి చేస్తారు? మీరు మీ ఉద్రేకములను అనుసరిస్తారా లేక మీరు నిర్ణయము తీసుకునే ముందు మీ ఉద్రేకములు తగ్గెంత వరకు వేచి యుంటారా?
దేవుడు మీ నిర్ణయములు శాంతితో ఏలబడవలేనని ఆశిస్తున్నాడు. ఆయన సమాధానము మిమ్మును ఏలుటకు అనుమతించుట అనగా మీ ఉద్రేకములు తగ్గెంత వరకు వేచియుండుట మరియు మీరు చేయునది సరియైనదని మీరు నిజముగా నమ్ముట.
మీ ఉద్రేకములు మిమ్మల్ని నిర్ణయములు తీసుకొనునట్లు అనుమతించవద్దు. ఎల్లప్పుడూ సమాధానముతో వెళ్ళుము.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నీ సమాధానము నా జీవితమును ఏలవలెనని ఎంపిక చేసుకున్నాను. నేను నా ఉద్రేకములను ఆధారము చేసుకొని నిర్ణయములు తీసుకొనవలెనని ఆశించుట లేదు, కానీ మీరు ఆశించిన మార్గములను శాంతియుతముగా తీసుకొనవలెనని ఆశిస్తున్నాను.