ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. —మత్తయి 18:20
ఒప్పందములో శక్తి ఉందని బైబిల్ చెప్తుంది. ఇది వివాహ జీవితములు ఖచ్చితముగా సత్యమై యున్నది. నా భర్త డేవ్, మరియు నేను కలిగియున్న వ్యక్తిత్వములు ఒకరికొకరు పూర్తిగా విరుద్ధముగా ఉండేవి. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎంతో సన్నిహితముగా చేసి యున్నాడు. కాబట్టి మేము దాదాపు ఒకే విధముగా ఆలోచించుట ప్రారంభించి యున్నాము మరియు ప్రతిరోజూ ఒకే విషయాలను కావాలని ఆశించేవారము. మేము ఇప్పటికీ రెండు విభిన్నమైన వ్యక్తిత్వములను కలిగియున్నాము, కానీ మా ఇద్దరి విభిన్నతలను దేవుడు తన ఉద్దేశ్యము నిమిత్తము ఒకటిగా చేసియున్నాడు.
మీ వివాహములో మరియు మీ ప్రార్ధనా జీవితములో శక్తిని పొందుకోవాలంటే మీరు కలిసి నడవాలి. ఒక పెద్ద ప్రశ్న ఏదనగా: అసమ్మతి గల జంట ఎలా ఒప్పందంలోనికి వస్తారు? ఒప్పందం అనేది స్వార్ధమును విడిచిపెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. స్వార్ధము అనునది పరిపక్వత లేని అంతరంగ దృష్టి. ఇతరులు దేనిని కోరుకుంటున్నారనే విషయములో శ్రద్ధ కలిగి యుండుటకు, మిమ్మును మీరు తగ్గించుకొనుటకు సిద్ధపడండి మరియు ఆ అవసరతలను తీర్చుటకు మీరేమి చేయగలరో దానిని చేయండి.
ఇది జరిగినప్పుడు, మీరు దేవుని ఎదుట ఒప్పందంతో కలిసి జీవించగలరు, మరియు ఇద్దరు ముగ్గురు ఆయన నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ వారి మధ్యన నేను ఉందునని దేవుడు చెప్పెను. కాబట్టి ఈరోజే మీ జీవిత భాగస్వామితో ప్రభువు ఎదుట ఒప్పందం చేసుకొని ఐక్యత కలిగి యుండుటకు ఒక ఎంపిక చేసుకోండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా వివాహ జీవితములోని ఒప్పందము యొక్క శక్తిని అనుభవించాలని ఆశిస్తున్నాను. మేమందరమూ మీ నామములో ఫలవంతముగా కలిసి జీవించునట్లు స్వార్ధం లేకుండా జీవించుటకు సహాయ చేయండి.