మీ దేహమును జాగ్రతగా చూచుకొనుట

మీ దేహమును జాగ్రతగా చూచుకొనుట

(వెల పెట్టికొని ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకొని) విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. —1 కొరింథీ 6:20

మనలో కొంత మంది మన దేహములను గురించి శ్రద్ధ తీసుకొనుటను గురించి నేర్చుకొనలేదు. దానిని మార్చుటకు, ఆరోగ్యకరముగా జీవించుటకు మూడు అతిపెద్ద అడ్డంకులను మనము ఎదుర్కొనవలెను.

మన దేహములను గురించి ఎలా శ్రద్ధ తీసుకొనవలెనో మనకు తెలియదు. చెడ్డ ఆహారపు అలవాట్లు, తప్పుడు సమాచారమును, మరియు ఫాస్ట్ ఫుడ్స్ ప్రజలను సరియైన ఆహారము సరియైన విధముగా తీసుకొనుటలో కలవరములో ఉంచుతుంది.

మన దేహపు స్వరూప్యము మీడియా మరియు వ్యాపార ప్రకటనల మీద ఆధారపడి యుంటుంది. మనము అందం లభించని ఆలోచలతో కొట్టబడుచుండగా, మన ఉబకాయం ఎంత ప్రబలుతు ఉన్ననూ దానిని సాధారణంగానే పరిగణిస్తున్నాము. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎలా ఉంటాడో మనము తిరిగి కనుగొనవలసి యున్నది.

వ్యాయామం దాదాపు వాడుకలో లేదు. మనము వ్యాయామ శూన్యతలో నివసించుటకు తగిన సౌకర్యములను కలిగి యున్నాము. మనము నడవవలసిన అవసరత లేకపోతే కొంచం కూడా నడవము! కానీ సత్యమేదనగా, మనం దేహములకు వ్యాయామం చేయుట ద్వారా మన శ్రేయస్సు యొక్క గొప్ప ఒప్పందం ఆధారపడి యుంటుంది.

మీరు ఈ అడ్డంకులతో పోరాడుతూ ఉన్నట్లయితే, మీరు ఓడించబడరని ఒక నిర్ణయం తీసుకోండి. మనము మన శరీరములను శ్రద్ధగా కాపాడుకోవాలని దేవుడు చెప్పాడు మరియు మనమేమి చేయాలనీ ఆయన చెప్పి యున్నాడో దానిని చేయుటకు ఆయన మనకు సహాయం చేయును. కాబట్టి దేవుని బలము మీద ఆధారపడుటకు మరియు ఆరోగ్యకరమైన జీవిత శైలిలో జీవించుటకు ఒక నిర్ణయం తీసుకోండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను నా దేహమును గురించి శ్రద్ధ వహించాలని మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించుట ద్వారా నేను మిమ్మును గౌరవించాలని ఆశిస్తున్నాను. నాలో పని చేయుచున్న మీ శక్తి ద్వారా నేను మార్పులు కలుగ జేయగలనని నేను నమ్ముచున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon