
అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని. … —1 తిమోతి 1:16
వివాహములో తమ జీవిత భాగస్వామి ద్వారా ఏర్పడిన నేరములు మరియు గాయములు అంత మంచివి కావు. మీరు గాయపడినప్పుడు మీరు ఎవరితోనైనా పంచుకొనుట చాల కష్టమని నాకు తెలుసు, కానీ ఇతరులను ప్రేమించుట ద్వారా మీరు గాయపడ్డారని ఎవరూ మీకు అభయమివ్వరు. వాస్తవముగా, మీరు గాయపడుటకు సిద్ధముగా లేని యెడల మీరు ప్రేమించలేరు. ఇది అసాధ్యము.
నిజమైన ప్రేమ కనికరమును చూపించును మరియు క్షమించును. ప్రేమ అనునది మరియొక వ్యక్తికి మరియొక అవకాశమును అనుగ్రహిస్తుంది. ప్రేమ అనునది వారు తరువాత కూడా యదార్ధమైన కార్యములను చేయుచు వారిలో ఉత్తమమును నమ్ముచు మరలా మరలా నమ్ముతూ ఉండుటయే.
మీ వివాహములో మీ దైనందిన వ్యవహారములతో పాటు ఒకవేళ గొప్ప గాయములు కుడా ఉన్నాయని నేను గుర్తించాను. అయినప్పటికీ, మిమ్మల్ని పట్టి యుంచిన మానసిక వ్యధ మిమ్మల్ని విడిచి పెట్టునట్లు అనుమతించవలెను. తరువాత మీరు నిజముగా క్షమించునట్లు దేవుని కృప కొరకు ప్రార్ధించి ఆయన మీద ఆనుకొనండి.
మీ వివాహములో మీరు క్షమించలేని తనమును గురించి మీరు కష్టపడుతుంటే, ఏ పరిస్థితులు మీకు చేదు అనుభవాలను ఇచ్చి యున్నాయో బయలు పరచమని దేవునిని అడగండి. ఆయన మీకు ప్రత్యక్ష పరచిన దానిని గురించి మీరు ఆశ్చర్యపడవచ్చు కానీ మీరు సత్యమును చూచినప్పుడు గాయమును వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించండి. మీ జీవిత భాగస్వామిని క్షమించుటకు నిర్ణయించుకొనండి మరియు దేవుని అద్భుతమైన నిబంధనలు లేని ప్రేమతో వారితో వ్యవహరించునట్లు సహనముతో నడుచుటకు నిర్ణయించుకోండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా వివాహ జీవితము ఉత్తమైనదిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎటువంటి క్షమించలేని తనము ఉన్నట్లయితే దానిని వెళ్ళగొట్టుటకు మరియు మీరు ఆశించిన రీతిగా సహనముతో నా భాగస్వామిని ప్రేమించుటకు నాకు సహాయం చేయండి.