
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. —మత్తయి 5:16
ప్రసిద్ధి గాంచిన తత్వవేత్త మరియు ప్రసంగీకుడు ఎడ్మండ్ ముర్రే ఒకసారి ఇలా చెప్పారు, “చెడును జయించుటకు అవసరమైన మంచిని మనుష్యులు ఏమీ చేయలేరు.” అది నిజమే. ఏమి చేయకుండుట సులభమే, కానీ ఇది చాలా అపాయకరమైనది. చెడుకు వ్యతిరేకముగా ఏమి చేయకపోతే చెడు అభివృద్ధి చెందుతుంది.
చెడు విషయాలను గురించి ఫిర్యాదు చేసే ఉచ్చులో మనమందరము పడతాము. కానీ ఫిర్యాదు చేయుట ద్వారా నిరుత్సాహ పడుట తప్ప ఏమీ సాధించలేము. అందులో ఎటువంటి అనుకూల శక్తి లేదు కనుక అది దేనిని మార్చలేదు.
దేవుడు ఈ సృష్టిని చేసినప్పటి నుండి ప్రతి వస్తువు ఫిర్యాదులతో ముందుకు సాగుతున్నట్లైతే లోకమంతా ఎంత గందరగోలముగా ఉంటుందో ఉహించండి. కానీ తండ్రి ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. ఆయన మేలుగా ఉంటూ న్యాయపరమైన పని కోసం చేస్తాడు. చెడు శక్తివంతమైనది కానీ మంచి మరింత శక్తి వంతమైనది.
దేవుడు ఆయన బిడ్డలైన నేను మరియు మీ – ద్వారా ఈ భూమి మీద ఆయన పనిని జరిగించుటకు ఎన్నుకున్నాడని మనము ఆగి గుర్తించాలి. మనలో ఉన్న ఆయన వెలుగును కలిగియున్నాము మరియు దానితో మనము ఏమి చేయకుండునట్లు దానిని ఖర్చు పెట్టలేము. ఏది ఏమైనా మనము ఆయన నామములో మేలు చేయుటకు మన జీవితములను జీవించుచుండగా మన వెలుగును ప్రకాశింప చేస్దాము.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, కేవలం వెనక్కి వాలి కూర్చొని ఏమి చేయకుండా ఉండటం చాల సులభం, కానీ మీ వెలుగు ప్రకాశించుటకు అనుమతించుట చాలా ఉత్తమం. దుష్టునికి ప్రతికులముగా నిలబడుటకు మరియు నేను పొందే ప్రతి అవకాశములో మీ మంచితనమునకు ప్రతినిదిగా పని చేయుటకు నాకు సహాయము చేయుము.