నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. —మత్తయి 5:43-44
స్పెయిన్ దేశమును ఐక్యపరచి ఒక హీరోగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తిని ఉద్దేశించి తీసిన ఎల్ సిద్ అనే సినిమాను నేను చాల ఇష్టపడతాను.
శతబ్ధాలుగా క్రైస్తవులు బందీల కొరకు పోరాడియున్నారు. వారు ద్వేశించుకొని ఒకరినొకరు చంపుకున్నారు. యుద్ధంలో ఎల్ సిద్ ఐదుగురు వ్యక్తులను బందించాడు కానీ వారిని చంపలేదు ఎందుకంటే చంపడం ద్వారా వారికి ఎటువంటి మంచి జరుగలేదు. అతని శత్రువులకు కనికరం చూపుట ద్వారా వారి హృదయాలను మారుస్తుంది మరియు రెండు బృందములతో సమాధానముతో జీవించగలరని నమ్మాడు.
అతడు బాధించిన వారిలో ఒకరు, “ఎవరైనా చంపవచ్చు కానీ నిజమైన రాజు మాత్రమే అతని శత్రువులకు మంచి చేయగలడు” అని అన్నాడు. ఎందుకనగా ఎల్ సిద్ యొక్క ఒక దయగల కార్యము వలన అతని శత్రువులు వారిని వారె అతనికి స్నేహితులుగా అర్పించుకున్నారు మరియు ఆ క్షణం నుండి సన్నిహితులుగా మారి యున్నారు.
యేసు ఒక నిజమైన రాజు, ఆయన మంచివాడు, దయగలవాడు మరియు అతనిని ద్వేశించిన వారిపై కూడా కనికరము చూపాడు. ఇప్పుడే, మీరు కనికరము చూపుటకు ఎవరి గురించైనా అలోచించి యున్నారా? కనికరము మరియు మంచి వారిగా వుండి ప్రత్యేకముగా మీ శత్రువులకు చూపుట అనునది మీరు చేసిన అత్యంత శక్తివంతమైన క్రియల్లో ఒకటై యుండవచ్చు.
ప్రారంభ ప్రార్థన
దేవా, అందరికి అనగా నా శత్రువులకు కూడా కనికరమును చూపుట అంత సులభము కాదు. మీ కృప ద్వారా ఇప్పుడు నేను కనికరము గల జీవితాన్ని జీవించుటకు ఎన్నుకున్నాను.