రొట్టె వలన మాత్రమే కాదు కానీ

రొట్టె వలన మాత్రమే కాదు కానీ

ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన మాటవలన నరులు బ్రదుకుదురని… (ద్వితీయోపదేశకాండము 8:3)

నా పరిచర్య నేను కోరుకున్నట్లుగా ఎదగని సంవత్సరాల్లో, నేను నిరాశ మరియు అసంతృప్తికి గురయ్యాను. నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థించాను మరియు నా సమావేశాలకు ఎక్కువ మంది వచ్చేలా చేయడానికి నాకు తెలిసిన ప్రతిదాన్ని ప్రయత్నించాను.

నేను కోరుకున్న ఎదుగుదలను దేవుడు నాకు ఇవ్వనప్పుడు నేను తరచుగా ఫిర్యాదు చేయడం మరియు కలత చెందడం నాకు గుర్తుంది. ప్రజల హాజరు మరియు ఉత్సాహం నేను కోరుకున్న దానికంటే తక్కువగా ఉండేలా దేవుడు నన్ను తరచుగా పరీక్షించాడు. నేను ఆ సమావేశాలను విడిచిపెట్టినప్పుడు, నేను ఇలా ప్రశ్నించాను: “దేవా, నేను ఏమి తప్పు చేస్తున్నాను? మీరు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు? నేను ఉపవాసం చేయుచున్నాను; నేను ప్రార్థిస్తున్నాను. నేను ఇస్తున్నాను మరియు నమ్ముతున్నాను మరియు మీరు నా తరపున కదలడం లేదు! నేను చాలా నిరాశకు గురయ్యాను, నా హృదయం బ్రద్దలైనట్లు భావించాను. “దేవా, మీరు నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?”అని నేను అడిగాను.

ఆయన నాతో మాట్లాడి, “జాయిస్, మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని నేను మీకు బోధిస్తున్నాను” అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఎడారి మార్గంలో వాగ్దాన దేశం వైపు ప్రయాణిస్తున్నప్పుడు వారు ఆశించిన దానికంటే చాలా తక్కువ వేగంతో ఆయన ఈ మాటలను చెప్పాడు. వారిలో విధేయతను కలిగించుటకు, పరీక్షించుటకు మరియు నిరూపించడానికి ఇది రూపొందించబడింది. మానవుడు కేవలం రొట్టెతో మాత్రమే జీవించడు, దేవుని వాక్యం ద్వారా జీవిస్తాడని వారికి బోధించడానికి దీనిని తెలియజేశాడు.

దేవుడు నాలో తగ్గింపును కలిగించుటకు పరీక్షిస్తున్నాడని అనుకోవడం నాకు నచ్చలేదు, కానీ “మనిషి రొట్టెతో మాత్రమే జీవించడు” అని దేవుడు నాకు చెప్పడం ద్వారా నా కోరికలు పూర్తిగా ఆయనపై మాత్రమే ఉండాలని కోరుకుంటున్నానని నేను గ్రహించాను. మరేదైనా ఉత్తమైన దానిని చేయడం కోసం కావచ్చు. కానీ నా జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్న తర్వాత మాత్రమే నా పరిచర్య సమయానుకూలంగా పెరిగింది. మీరు దేవునితో మాత్రమే సంతృప్తి చెందగలిగినప్పుడు, మీరు కలిగి ఉండాలనుకునే ఇతర వస్తువులను ఆయన మీకు అందించగలడు. ఆయన జీవితంలో మనకు నిజమైన రొట్టె మరియు మన ఆత్మలకు నిజమైన పోషణ.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: కేవలం రొట్టె వలన జీవించుటను వదిలి పెట్టండి; దాని కంటే మరి ఉత్తమమైన దాని కోసం ఎదురు చూడండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon