సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను….. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి. —ఫిలిప్పి 1:12, 14
మనము దేవుని వాక్యముతో ఇమిడి యున్నాము గనుక కొన్నిసార్లు సాతాను దాడులను మనము ఎదుర్కొనవలసి యున్నది. ఎవరైతే దేవునికి భయపడుచు దానికి లోబడతారో… ఆ వాక్యమును బట్టి వారికి శోధనలు ఎదురైనప్పుడు వారు వెంటనే బాధపడతారు (సంతోషములేక, దిగులుతో నిండి పోతారు) మరియు వారు చెదిరిపోయి పడిపోతారు కాబట్టి వాటిని గురించి మార్కు 4:17 లో వ్రాయబడి యున్నది.
వాక్యము మనలను బలపరుస్తుందని సాతానుకు తెలుసు మరియు మనము దానిని ఇతరులతో పంచుకుంటామని తెలుసు కాబట్టి వాడు అడుగు పెడతాడు. కాబట్టి మీ హృదయములోని వాక్యమును భద్రము చేసుకొనుట చాల ప్రాముఖ్యమైనది మరియు సాతానుడు దానిని ఎత్తుకొని పోవుటకు వచ్చినప్పుడు ఎదిరించండి. మీరు దానిని చేసినప్పుడు సాతానుడు తెచ్చే శోధనలు ఇతరులను దేవుని దగ్గరకు తెచ్చుటకు సహాయపడతాడు.
అపోస్తలుడైన పౌలు దేవునిలో సామర్ధ్యమును కలిగి యుండుటకు మరియు భయము లేకుండా సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాడు గనుక దేవుడు అతని జీవితములో అనేక విషయాల గుండా వెళ్ళుటకు అనుమతించి యున్నాడు. పౌలు యొక్క జైలు జీవితంలోకూడా దేవుని ద్వారా వాడబడుటలో స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించాడు.
ఒకవేళ మనము ఇతరులకు పరిచర్య చేయాలనుకుంటే, మనము వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటాము. కానీ మనము విశ్వాసములో నిలిచి యుండి దేవునిలో ఆత్మ విశ్వాసమును కలిగి యున్నట్లైతే, దేవునిలో విజయం ద్వారా మనలను నడిపిస్తాడు మరియు ఈ ప్రక్రియలో మనలను ఇతరులకు గొప్ప ప్రోత్సాహముగా మారతాము.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నీలో మరియు మీ వాక్యములో అనుదినము నిలిచియుండాలని ఆశిస్తున్నాను. నా మార్గములో శోధనలు వచ్చినప్పుడు, నన్ను బలపరచుటకు మరియు నా చుట్టూ ఉన్న వారికీ మీ వాక్యమును ప్రకటించుటకు నేను ఆ అవకాశమును వాడుకొనునట్లు నాకు సహాయం చేయమని ప్రార్ధిస్తున్నాను.