నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. – కీర్తనలు 89:14
దేవుడు న్యాయవంతుడు. అది అయన గుణలక్షణమై యున్నది – ఆయన ఏమై యున్నాడో – మరియు దానిని మనము పొందుకోవాలని ఆశిస్తున్నాడు.
న్యాయము తప్పు విషయాలను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. మన చుట్టూ ఉన్న లోకంలో అన్యాయాలను పరిష్కరించడానికి దేవుడు మన ద్వారా పని చేయునట్లు అయన ప్రతినిదులమై యున్నాము. మనము తప్పును చూస్తున్న ప్రతిసారి, దాని గురించి ప్రార్థించటానికి మన మొదటి ప్రతిస్పందన ఉండాలి. మన రెండవ స్పందన ఏదనగా దానిని గురించి ఏమి చేయాలనే విషయమును గురించి మనలను మనమే ప్రశ్నించాలి.
మన చుట్టూ ఉన్న అవసరతలను గురించి మనము ఉత్సాహం కలిగి యుండుట సులభమే. కాబట్టి మనము ఇటువంటి సంగతులను చూసినప్పుడు అది ఇతరుల సమస్య కాబట్టి వారే దానిని పరిష్కరించుకోవాలనుకుంటారు! వారు దానిని మరియు దీనిని చేయాలని కోరుకుంటారు.
వారు ఎవరు అని అడుగుట మీరెప్పుడైన అడగటం అపివేసారా? వారు ఎవరో కాదు కనీ మనమే – నీవు మరియు నేను! మీరు సమస్తమును పరిష్కరించుకోలేరు కానీ మీరు ఎంతో కొంత చేయగలరు. మీరు అన్యాయము వైపు చూడక ఏమి చేయకుండా ఉండవద్దు. మీరు స్తబ్దుగా మరియు సోమరిగా ఉండునట్లు మిమ్మల్ని సృష్టించలేదు మరియు మీరేమి చేయగలరో దానిని దేవునిని అడిగి తెలుసుకోనుమని అయన కోరుతున్నాడు. అయన మిమ్మల్ని ఆసక్తి, భారము మరియు ఆశ కలిగి యుండునట్లు సృష్టించాడు. అయన మహిమ నిమిత్తము మీరు ఉపయోగించబడునట్లు మరియు ఇతరులకు కూడా సహాయపడునట్లు అయన మీలో వరములను అనుగ్రహించియున్నాడు. కాబట్టి ఈరోజు న్యాయముతో కూడిన జీవితమును జీవించుము.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్దాత్మా, అన్యాయమును గురించి నేను ఏదైనా చేయగలిగి యుండి ఇతరులు ఏదో చేస్తారని చూస్తూ కుర్చొనకుండా ఉండునట్లు నన్ను అనుమతించ వద్దు. ధైర్యముతో నన్ను నింపండి మరియు నా చుట్టూ ఉన్న ప్రపంచములో తప్పులను ఎలా సరి చేయవలెనో నాకు చూపించుము.