వేచి యుండుట నేర్చుకోండి

వేచి యుండుట నేర్చుకోండి

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు – యెషయా 40:31

“నేను దేవుని నుండి వింటున్నానా లేక నా స్వంతగా వీటిని చేస్తున్నానా అని నేను ఖచ్చితముగా ఎలా తెలుసుకోగలను?” అని ప్రజలు తరచుగా నన్ను ప్రశ్నిస్తుంటారు.

వేచి యుండుటను గురించిన సమాధానమును నేను నమ్ముతాను. పెద్ద నిర్ణయాలతో, మనము తరచుగా అత్యవసరము అవసరం అని భావిస్తున్నాను. మనము ఏదో చేయవలెను మరియు అది ఇప్పుడే చేద్దాము! కానీ దైవిక జ్ఞానం మనం ఏమి చేయాలో మనకు స్పష్టంగా చూపించేంత వరకూ వేచి యుండమని, మనం చేయబోతున్నప్పుడు అది వేచిఉండమని మనకు చెబుతోంది.

మనము ఒక అడుగు వెనక్కు తీసుకోవటానికి మరియు ప్రతి దృక్కోణమును దేవుని దృక్కోణం నుండి చూసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటాం.

వేచియుండుటలో శక్తి కనుగొనబడి యున్నది. నీవు ప్రభువు కొరకు వేచి చూస్తే, నీ ఆత్మలో నీవు నిజంగా ఏమి చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడో …. ఆయన నీవేమి చేయవలేనని కోరుకుంటున్నావో అది కాదు.

ఏ కష్టమైన నిర్ణయాన్నైనా మీరు ఎదుర్కొన్నప్పుడు, మీరు తప్పు చేశామనే భావన రాక మునుపు స్పష్టమైన సమాధానం వచ్చేవరకు వేచి ఉండటం మంచిది. ఇది అసౌకర్యంగా ఉండవచ్చు, మీరు అత్యవసరంగా ఉండవచ్చు, కానీ దేవుని జ్ఞానము మరియు వివేకమును గురించి ఆలోచించుటలో ముందుగానే ఒత్తిడిని అనుమతించకండి.

ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను తప్పు చేశాననే భావన రాక మునుపే నేను తీసుకునే నిర్ణయపు క్షణములోని వేడిలో నేను చిక్కుబడుటకు నాకు ఇష్టం లేదు.  అనుదినము వేచి ఉండమని నాకు గుర్తు చేయి. ఇది కష్టం కావచ్చు, కానీ మీ జ్ఞానం మరియు వివేచన  అందుకోవడం విలువైనది.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon