
ప్రేమ (మనలో ఉండే దేవుని ప్రేమ)…అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును (తప్పుగా బాధపడినట్లైతే దానిని) మనస్సులో ఉంచుకొనదు. —1 కొరింథీ 13:5
మనందరము కొన్నిసార్లు గాయపడతాము మరియు మనము అత్మీయముగా బలముగా మరియు ఆరోగ్యకరముగా ఉండాలంటే త్వరగా క్షమించుట మనము నేర్చుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు, ఎవరైనా మిమ్మును గాయపరచిన యెడల, ఆ గాయమును గుర్తు పెట్టుకొని తరువాత 10 సంవత్సరాలు మిమ్మును మీరు గాయపరచుకొని యుండుటలో నిలిచి యుండకుడి. మీరు ఆ సంఘటనలో సంవత్సరములుగా జీవిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి మిమ్మును గుర్తు పెట్టుకోకుండా ఉండవచ్చు. అయినప్పటికీ గాయపడే ఒకే ఒక వ్యక్తి ఎవరనగా – మీరే.
మనము క్షమించలేని తనములో నడుస్తూ ఉంటే మనలను గురించి మనము ఇతరులకంటే ఎక్కువగా ఉహించుకుంటూ, “స్కోర్ (లెక్క) చేయడానికి” ప్రయత్నిస్తూ ఉంటాము.
మా వివాహ ప్రారంభ దినములలోనికి వెళ్లినట్లైతే, నేను మరియు డేవ్ చాలా కోపముగా మరియు ఒకరి మీద ఒకరు అలుగుతూ ఉండే వారము, నేను నా గతములో జరిగిన సన్నివేశములను జ్ఞాపకం చేస్తూ ఉంటె, డేవ్ కు అవేమి గుర్తు ఉండేవి కావు కాబట్టి “వీటన్నిటినీ ఎక్కడ నుండి తీసుకొని వచ్చావు?” అని అడిగేవాడు. మంచిది, నేను ఒక ప్రదేశమును కలిగి యున్నాను మరియు ఆ ప్రదేశము నన్ను బాగుగా తినివేయుచున్నది. డేవ్ చేసిన ప్రతి తప్పు నా హృదయములో ఒక చేదైన శురుడుగా మారునట్లు ఆ జాబితాలో చేరుతూ ఉన్నది.
దేవా నేను జీవించుటకు ఒక చేదైన మార్గమును నేను నేర్చుకొని యున్నాను! మనము దేవుని ప్రేమలో నడుస్తున్న యెడల, మన కొరకు చేయబడిన తప్పులు లెక్క పెట్టుకోకుండా ఉండే స్వేచ్చను మనము కనుగొంటాము. మీరు ఈరోజు క్షమించలేనితనము అనే బాధ నుండి మీరు గాయపరచబడినట్లైతే మీరు స్కోర్ (లెక్క) లేకుండా ఉండుటకు దేవుని సహాయం కొరకు అడగండి. ఈరోజే మీరు చేదు తనమును వెళ్ళగొట్టగలరు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ఇక ఎంత మాత్రమును స్కోర్ (లెక్క) ఉంచుకోనవలెనని మరియు హృదయములో క్షమించలేని తనమును ఉంచుకొనవలెనని ఆశించుట లేదు. నేను దానిని నీకు వదిలిపెట్టుచున్నాను మరియు నేను మీ ప్రేమలో నివసించునట్లు తద్వారా, “ఏ చెడును గురించిన ఖాతా లేకుండునట్లు” మీరు నాకు సహాయం చేయండి.