స్నేహము మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది

స్నేహము మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. (హెబ్రీ 4:16)

మనము దేవునితో కలిగియున్న స్నేహమును అర్ధం చేసుకున్నప్పుడు మరియు మనల్ని మనం స్నేహితులుగా చూసుకున్నప్పుడు, మన ప్రార్ధనలు ఎక్కువగా ఆత్మచే నడిపించబడే, ఎక్కువగా విశ్వాసముతో నింపబడిన, మరియు మరింత ధైర్యముతో కూడినవిగా ఉంటాయి. మనము “ప్రభువు ప్రార్ధన” అని పిలిచే ప్రార్ధనను యేసు తన శిష్యులకు నేర్పించిన వెంటనే, యేసు లూకా 11వ అధ్యాయము నుండి ఒక కథ చెప్పాడు. మరియు ఆయన వారితో ఇట్లనెను “మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లిస్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చి యున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనే యుండి నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.” (లూకా 11:5–8).

ఎవరికైతే రొట్టె అవసరమో ఆ వ్యక్తి మాత్రమే దానిని పొందుకోగలడు, “ఎందుకంటే, అతని సిగ్గులేని పట్టుదల ద్వారానే” పొందుకుంటాడు. ఎందుకంటే స్నేహం మనల్ని ధైర్యవంతులనుగా చేస్తుంది, మరియు దేవునితో మన స్నేహంలో మనం ఎంతగా ఎదుగుతున్నామో మరియు అంతగా అభివృద్ధి చెందుతాము, మనం ఆయనను సమీపిస్తున్నప్పుడు అంత ధైర్యంగా మరియు మరింత నమ్మకంగా ఉండవచ్చు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు మీ సన్నిహిత స్నేహితుల కోసం రిజర్వ్ చేసిన అదే అభిరుచి మరియు సాన్నిహిత్యంతో ప్రార్థన చేయాలని గుర్తుంచుకోండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon