డబ్బుతో వ్యవహరించే ఉత్తమ మార్గము

డబ్బుతో వ్యవహరించే ఉత్తమ మార్గము

బీదలకిచ్చువానికి లేమి కలుగదు … —సామెతలు 28:27

డబ్బుతో వ్యవరించుటకు నేను కనుగొనిన ఉత్తమ మార్గమేదనగా దానిని ఇచ్చి వేయుట. మరియు ప్రత్యేకించి సవాలుతో కూడిన ఆర్ధిక పరిస్థితులలో మనము ఇస్తూనే ఉండాలి. మన ఆర్ధిక విషయాల్లో లేఖన పరమైన సూత్రములను పాటించుటకు ఇది మూల కారకము.

కష్ట పరిస్థితులలో కూడా దేవుని ఆర్ధిక సూత్రములపై నివసించుటకు ఎల్లప్పుడూ ఇది సాధ్యమే. అసాధ్యమైన ఆర్ధిక పరిస్థితుల వలె మీరు మీకు కనపడినప్పటికీ మీరు ఇచ్చే స్థానములోనే ఉండాలి కానే అది మిమ్ములను ఆపునట్లు అనుమతించకండి.  మీరు కలిగియున్న దానితో మీరు పని చేస్తున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేయును.

లూకా 19:17 మనకు తెలియజేస్తున్నదేమనగా మనము చిన్న విషయాల్లో నమ్మకముగా మరియు యోగ్యులముగా ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. మనము ఇలా చేస్తే గొప్ప విషయాల మీద ఆయన మనకు అధికారమును అనుగ్రహిస్తాడు.

సామెతలు 28:17 చెప్తున్నదేమనగా, బీదలను ఇచ్చువానికి కొదువ కలుగదు… మన ఆర్ధిక పరిస్థితులతో మనము దేవునికి విధేయత చూపినట్లైతే, మనకు అధికముగా లేకపోయినా మరియు ఇతరులకు సహాయము చేసినా, మనకు అవసరమైన దానిని దేవుడు అనుగ్రహించును. ఇది చాల సులభము. ఈరోజు ఇచ్చువానిగా ఉండుటకు ఎన్నుకొనుము మరియు మీకు ఏ కొదువ ఉండదు.


ప్రారంభ ప్రార్థన

దేవా, ఈరోజు నా ఆర్ధిక వనరులను నీకిచ్చుటకు ఎన్నుకొని యున్నాను. కష్ట సమయాల్లో కూడా, మీ ఆర్ధిక సూత్రములు ఇంకనూ అన్వయించాబడతాయి మరియు మీరు నా గురించి శ్రద్ధ వహిస్తారు. మీరే నా ఆధారము!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon