మీ అంతరంగము బహిరంగ జీవితముతో కలుస్తుందా?

మీ అంతరంగము బహిరంగ జీవితముతో కలుస్తుందా?

 ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము (మీ చుట్టూ) మీ మధ్యనే (మీ హృదయములోనే) యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను.  —లూకా 17:21

కొన్నిసార్లు మనము పరిస్థితులు మారాలని ఆశిస్తాము కానీ విషయాలు ఉత్తమముగా ఉండాలంటే చేయవలసిన పనులను చేయము.

నా జీవితములో నా పరిస్థితులను గురించి నేను నిరుత్సహపడిన సంఘటనలున్నాయి. నా కొరకు దేవుడు వాటిని మార్చాలని నేను ఆశించి యున్నాను మరియు నా చుట్టూ ఉన్న ప్రజలను కూడా మార్చమని దేవునిని అడిగే దానిని. నా బహిరంగ జీవితములో నిజమైన మార్పును ఆశించుటకు ముందు నా అంతరంగములో మార్పు కొరకు నేను పని చేయవలసి యున్నదని ఆయన నాకు చూపించాడు.

మత్తయి 6:33 చెప్తున్నదేమనగా, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకినప్పుడు మీకు అవసరమైన సమస్తమును దేవుడు అనుగ్రహించునని చెప్పబడుతున్నది.

కాబట్టి దేవుని రాజ్యమనగా నేమి? దేవుని రాజ్యము మనలోనే ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు క్రీస్తును అంగీకరించినట్లైతే, దాని అర్ధము ఆయన మీలో జీవించుచున్నాడు – మరియు ఆయన ఒక మంచి ఆత్మీయ గృహమును కలిగి యుండాలని ఆశిస్తున్నాడు. అందుకే మీ అంతరంగ జీవితము దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది.

మన అంతరంగమును పరిశుద్ధాత్మ దేవుని ఆధీనమునకు అప్పగించునట్లు మనము ఆయన రాజ్యమును వెదకాలి. మనలో పని చేయునట్లు ఆయనను అనుమతినిచ్చినట్లైతే మనము దానిని కలిగి యుండలేక పోవచ్చు మరియు అది పొర్లి పారుతూ మన చుట్టూ ఉన్న లోకమును మారుస్తుంది!


ప్రారంభ ప్రార్థన

పరిశుద్దాత్మ దేవా, మీ రాజ్యమును నా హృదయములో అభివృద్ధి చేయుటలో దృష్టి ఉంచునట్లు మీరు నన్ను అడుగుతుండగా అందులో చిక్కుబడి పోకుండునట్లు నాకు సహాయం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon