యేసును గురించి ఎలా తెలుసుకోవాలో మీరు నేర్చుకొనినప్పుడు, మీ జీవితమును గురించి దేవుడు కలిగియున్న ప్రణాళిక లోనికి అద్భుతమైన ప్రయాణమును మీరు ప్రారంభిస్తారు.
రోమా 3:23 ఇలా చెప్తుంది: “ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు”. యేసును తెలుసు కొనుట అనునది కేవలం ఆయన కొరకు మీరు కలిగియున్న అవసరతను అంగీకరించుట, ఆయన మీ కొరకు చేసిన దానిని నమ్ముట మరియు ఆయన అద్భుతమైన బహుమానమును అంగీకరించుట. మీరు పాపము చేసియున్నారు మరియు మీకు ఒక రక్షకుడు అవసరము కనుక మీ జీవితమును మీయంతట మీరే జీవించలేరని ఇది గుర్తిస్తుంది. మరియు యేసును గురించి తెలుసుకొనుట, రక్షించబడుటను గురించిన శుభవార్త ఆ సమయంలో జరిగే ఒక అందమైన మార్పిడియై యున్నది. మీరు చేసిన ప్రతి చెడు మరియు పాపపు పనులను ఆయనకు అప్పగించుము మరియు దానికి బదులుగా దేవుడు మీ కొరకు దాచియుంచిన సమస్థమును మీకు అనుగ్రహించును. ఒకవేళ మీకు తెలిసిన లేక ఇంకనూ తెలియక పోయినా మీ జీవితము యెడల ఆయన కలిగియున్న ప్రణాళిక అద్భుతమైనది మరియు ఆ ప్రయాణములో ఇది మీ మొదటి అడుగు.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. .”— యోహాను 3:16