యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని! (కీర్తనలు 122:1)
క్రైస్తవులుగా, మనకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి! మనం దేవుణ్ణి తెలుసుకోగలము, ఆయన స్వరాన్ని వినగలము, ఆయన ప్రేమను పొందగలము, మనకు ఏది ఉత్తమమైనదో ఆయనను విశ్వసించగలము మరియు మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆయన అదుపులో ఉంచుతాడనే వాస్తవంలో విశ్రాంతి తీసుకోవచ్చు. మనము ఉత్సాహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి! మనము అన్ని రకాల ఇతర విషయాల గురించి సంతోషిస్తాము, కాబట్టి దేవునితో మనకున్న సంబంధం గురించి మనం ఎందుకు సంతోషించకూడదు?
ఆధ్యాత్మిక నేపధ్యంలో కనిపించే ఉత్సాహం ఏదైనా దానిని “భావోద్వేగము” అని ప్రజలు తరచుగా చెబుతారు. దేవుడు మనకు భావోద్వేగాలను ఇచ్చాడని మరియు వాటిని మన జీవితాలను నడిపించడానికి మనం అనుమతించనప్పటికీ, ఆయన వాటిని ఒక ప్రయోజనం కోసం మనకు ఇస్తాడు, అందులో భాగమే ఆనందం అని నేను చివరకు గ్రహించాను. మనం నిజంగా దేవుణ్ణి ఆస్వాదిస్తున్నట్లయితే, దాని గురించి మనం కొంత భావోద్వేగాన్ని ఎలా చూపించకూడదు? మన ఆధ్యాత్మిక అనుభవం ఎందుకు పొడిగా మరియు బోరింగ్‌గా, నిస్తేజంగా మరియు నిర్జీవంగా ఉండాలి? క్రైస్తవ మతం పొడి ముఖాలు, విచారకరమైన సంగీతం మరియు నిశ్శబ్ద ఆచారాల ద్వారా వ్యక్తీకరించబడుతుందా? ససేమిరా కానే కాదు!
ఈరోజు వచనంలో, దావీదు తాను దేవుని ఇంటికి వెళ్ళడానికి సంతోషిస్తున్నానని చెప్పాడు. 2 సమూయేలు 6:14లో, అతడు “తన పూర్ణశక్తితో” దేవుని యెదుట నాట్యం చేశాడు. అతను కూడా తన వీణ వాయిస్తూ, దేవునికి స్తుతి పాడాడు మరియు చాలా సంతోషించాడు. కానీ దావీదు పాత నిబంధన క్రింద జీవించాడు. ఈరోజు మనం క్రొత్త నిబంధన క్రింద జీవిస్తున్నాము మరియు దాని క్రింద, క్రీస్తును విశ్వసించే మనం నిరీక్షణ, ఆనందం మరియు సమాధానముతో నిండి ఉన్నాము (రోమీయులకు 15:13 చూడండి). మనం ఇకపై దేవునికి ఆమోదయోగ్యంగా ఉండటానికి కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ యేసు మనల్ని అంగీకరించేలా చేసిన కృపలో మనం విశ్రాంతి తీసుకుంటాము. మన పనుల ద్వారా మనల్ని మనం సమర్థించుకోవడానికి ఇకపై ప్రయత్నించాల్సిన అవసరం లేదు, కానీ మనం విశ్వాసం ద్వారా సమర్థించబడతాము. మనం ఆయన స్వరాన్ని వినవచ్చు మరియు ఆయన ఉనికిని ఆనందించవచ్చు. మనము అన్ని రకాల బానిసత్వం నుండి విముక్తి పొందాము! ఉత్సాహంగా ఉండటానికి ఇవే గొప్ప కారణాలు!
ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవునితో మీ సంబంధమును గురించి మీరు ఉత్తేజింపబడే పది కారణములను వ్రాయండి.