దండన అవసరం

దండన అవసరం

ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. హెబ్రీయులు 12:6

నేను ప్రభువుతో సహవాసం నుండి బయటకు ఉండాలని ఎన్నడూ కోరుకొనను. నేను నా జీవితంలో ప్రతిరోజు ఆయనను పొందాలి.

అందువల్ల పరిశుద్ధాత్మ యొక్క దండనను బట్టి నేను చాలా కృతజ్ఞుడను. నేను దేవునికి దుఃఖం కలిగించేది ఏదైనా చేస్తున్నట్లైతే ఆయన మన సమాచారము లేదా మన సంబంధంతో జోక్యం కలుగ జేసుకుంటాడని నాకు తెలుసు. ఆయన సరియైన విధానములోనికి నన్ను దండించి నడిపించును.

మనము మన స్వంత పిల్లలను ప్రేమిస్తున్నదాని కంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమలో ఆయన మనల్ని శిక్షిస్తాడు. మనము తప్పు మార్గంలో ఉన్నప్పుడు ఆయన మాకు తెలియజేస్తాడు. అవసరమైతే, మన దృష్టి వారిపై కేంద్రీకరించబడునట్లు పదిహేను మార్గాలు మనకు తెలియజేయవచ్చు.

ఆయన దండించే ప్రేమ యొక్క సందేశం ప్రతిచోటా ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనమాయన చెప్పేది వినాలని ఆయన కోరుకున్నాడు. కాని మన మార్గాల్లో మనము కొనసాగితే, ఆయన మనకు ఉన్న హక్కులు,

ఆశీర్వాదాలను నిలిపివేస్తాడు, ఎందుకంటే ఆయన మనము ఎదగాలని కోరుకుంటున్నాడు, కాబట్టి మనకు ఏది ఉత్తమమైనదో దానిని మనము కలిగి యుంటాము.

గుర్తుంచుకో, మీరు దండనకు లోబడితే, అది నిన్ను పైకి ఎత్తుతుంది మరియు పాపం నుండి బయటకు తీసుకువస్తుంది మరియు మిమ్మల్ని దేవుని హృదయానికి తిరిగి నడిపిస్తుంది.

దండన మనల్ని దేవునిలో నూతన స్థాయికి తీసుకెళ్తుంది. దీనిని అడ్డుకోవద్దు; దాన్ని స్వీకరించండి!


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నీవు నన్ను ప్రేమిస్తున్నావని మరియు నాకు ఏది ఉత్తమమైనదో దానినే కోరుకుంటున్నావని నాకు తెలుసు. నన్ను దండించినందుకు మరియు నేను పాపం లేదా తప్పులు చేస్తున్నప్పుడు నన్ను క్రమశిక్షణలో ఉంచుతున్నందుకు ధన్యవాదాలు. నేను సాధ్యమైనంతగా మీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి మీకు మరియు నాకు మధ్య దేనిని అనుమతించకుండునట్లు నాకు సహాయం చేయండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon