
… మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; …. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. —1 సమూయేలు 16:7
కొంత మంది ప్రజలు వేసుకునే దుస్తుల విషయంలో నేను తీర్పరిగా ఉండేదానిని. నేను సదస్సులలో ప్రసంగించేటప్పుడు నేను జీన్స్ వేసుకోకూడదని ఆలోచించే దానిని, కానీ నా కుమారుడు నాతో, “దేవుడు డెనిమ్ కంటే పాలిస్టర్ నే అభిషేకిస్తాడని నీవు నిజముగా ఆలోచిస్తున్నావా?” అని అడిగాడు.
అనేక మంది ప్రజలను దేవుని కొరకు పట్టుకొనమని దేవుడు ఆదేశించినప్పుడు, నేను కేవలం మతపరమైన వైఖరులతో పట్టబడి యున్నప్పుడు ఇటువంటి విషయాలు నన్ను షాక్ కు గురి చేసాయి.
ఖచ్చితముగా, మనము చర్చి వెళ్ళేటప్పుడు బాగుగా దుస్తులు ధరించాలి. కానీ దీని సరిహద్దు రేఖ ఎదనగా మనము ప్రధాన లక్ష్యము నుండి తప్పిపోకుండునట్లు మనము బహిరంగ వైఖరి మీద దృష్టిని నిలపకూడదు: కానీ దేవునితో సన్నిహితం వ్యక్తిగత సంబంధమును కలిగి యుండవలెను.
దేవుడు కేవలం ఆయనతో సన్నిహిత సంబంధమును కలిగి యుండవలెనని ఆశిస్తున్నాడు అనగా మన సన్నిహిత స్నేహితునితో లేక కుటుంబ సభ్యునితో ఎలా రోజంతా సన్నిహితముగా ఉంటామో అలాగే దేవునితో సంబంధమును కలిగి యుండుట. ఆయన బహిరంగముగా ఎలా కనపడాతామనే విషయములో ఎక్కువ శ్రద్ధ చూపడు … కేవలం నిజమైన సంబంధమును కలిగి యుండుటనే ఆయన కోరుకుంటాడు.
ఆయనతో సమయాన్ని గడపండి, ఆయన మీ జీవితములో ఏమి చేసాడో లేక ఏమి చేస్తున్నాడనే విషయములో మీరు కృతజ్ఞతను కలిగి యుండండి. ఆయనతో నిజమైన సంబంధమును కలిగి యుండండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, బాహ్య రూపాన్ని గురించి మీ వైఖరిని కలిగి యుండునట్లు నాకు సహాయం చేయండి. నేను ఆలోచించిన విధముగా ఇతరుల దుస్తులు ధరించాలని నేను వారిని తీర్పు తీర్చకుండా సహాయం చేయండి మరియు మీతో నేను బలమైన అంతరంగ సంబంధమును కలిగి యుండునట్లు సహాయం చేయండి.