…నేను చెప్పునదేమనగా (అలవాటు ప్రకారముగా) (పరిశుద్ధ) ఆత్మానుసారముగా నడుచు కొనుడి, …అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. —గలతీ 5:16
మేము ప్రతిసారీ నిరాశకు గురవుతున్నామని నమ్ముతున్నాము, అంటే నిజంగా దేవునిపై ఆధారపడటం మానివేశామని దీని అర్ధం. అది మీకు ధైర్యంగా చెప్పినట్లుగా అనిపిస్తుంది, కాని దాని గురించి ఆలోచించండి: దేవుడు మీకు మరియు నాకు పరిశుద్ధ ఆత్మను, ఆయన కృపను ఇచ్చాడు.
మనము ఆయన మీద ఆధారపడుట మానివేసినప్పుడు మన స్వంత మార్గంలో ఏదో జరిగేటట్లు ప్రయత్నించినప్పుడు నిరాశ మొదలవుతుంది. ఇది అర్థం చేసుకోవడమే నాకు నిజంగా సహాయపడింది. ప్రతిసారీ నేను నిరాశకు గురయినప్పుడు, నేను నిజంగా పరిశుద్ధాత్మ స్థానమును తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని నాకు గుర్తుచేయబడింది. నేను పరిశుద్ధాత్మ జూనియర్ గా ప్రయత్నిస్తున్నాను!
మీరు స్వతంత్ర ఆత్మతో పోరాడుతున్నారా? మీరు దేవుని పై ఆధారపడకుండా తిరస్కరించినప్పుడు, “సరే, దేవా, నేను నీవు నన్ను ఆవరించియున్నావు, కానీ నేను దీనిని చేయుచుండగా గమనించు” అని చెప్తున్నావు. సమస్తమునకు దేవునిపై ఆధారపడుట చాలా కష్టంగా ఉంటుంది, కానీ విజయం అనేది మన జీవితాలకు ప్రతి రోజు అవసరం.
దేవుడు మనలను రక్షించినప్పుడు, ఆయన మనకు సహాయపడకుండా, “సరే మంచిది, ఇప్పుడు నీవే నీ స్వంతగా పనిచేయుచున్నావు!” అని చెప్పుట లేదు. ఆయన మనలను నిత్యత్వముగా రక్షించాడు, అనగా మనము ఆయన మీద అధారపడినప్పుడు ఆయన మనలను నడిపించుచు మనకు సహాయం చేయును.
గలతీ 5:16 మనలను ప్రాధేయపడుచున్న దేమనగా(అలవాటు ప్రకారముగా) (పరిశుద్ధ) ఆత్మానుసారముగా నడుచు కొనుడి, …..అప్పుడు మీరు ఖచ్చితముగా శరీరేచ్ఛను నెరవేర్చరు. అది ఇలా చెప్పుట లేదని గ్రహించండి “వ్యక్తిగతముగా శరీరమును జయించండి…. అప్పుడు మీరు ఖచ్చితముగా శరీరేచ్చలను నెరవేర్చరు.” కాదు, పరిశుద్దత్మలో జీవించమని చెప్తుంది.
మీరు స్వతంతులుగా జీవించుట ఆపండి మరియు దానికి బదులుగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి. మీరు దాని విషయంలో చింతించరని వాగ్ధానము చేయుచున్నాను!
ప్రారంభ ప్రార్థన
దేవా, నాకు నీవు అవసరము. నా మీద నేను నమ్మిక యుంచకుండునట్లు నాకు సహాయం చేయండి, కానీ మీ మీద నమ్మకముంచుటకు, మరియు మీ మీద ఆధారపడుటకు సహాయం చేయుము.