
కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. —సామెతలు 13:12
“మంచి విషయాల కొరకు ఆనందముగా ఎదురుచూచుట” అని నేను నిరీక్షణను నిర్వచిస్తాను. మన జీవితములలో దేవుని మంచితనము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, అది గొప్ప ఆనందము కొరకు ద్వారములను తెరచును. కాబట్టి మీ జీవితములో ఒక మేలు కొరకు మీరు ఆశతో నిరీక్షిస్తున్నారా?
మనము జీవించినంత కాలము, నీవు మరియు నేను ఎల్లప్పుడూ ఎక్కడో ఒక చోటికి వెళ్తున్నామని అర్ధము. దేవుడు మనలను లక్ష్యము కలిగిన దర్శనికులుగా ఉండాలని సృష్టించి యున్నాడు. దర్శనము లేకుండా, మనము విసుగుదల కలిగి నిరీక్షణ లేని వారిగా ఉంటాము. సామెతలు 13:12 ప్రకారము నిరీక్షణ అనునది హృదయమును వేదన నుండి వేరు పరుస్తుంది, కానీ మన మనో వాంఛ సిద్ధించినప్పుడు అది జీవవృక్షము.
మనము దేవుని నిరీక్షణ ద్వారా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి మనము మన జీవితములో ఆనందించ గలము.
మీకు నిరీక్షణలేని యెడల మీరు ఆనందముగా ఉండలేరు. మీరు దేవునిలో ఎంత నిరీక్షణను కలిగియుంటే అంత సంతోషముగా ఉంటారు. నిరీక్షణ ద్వారా సమస్తము సరియైన విధముగా మారుతుంది – నిరీక్షణ అనుకూలమైనదిగా ఉంటుంది! జీవితములో ఆనందించుటకు మీరు మేలుకరమైన నిరీక్షణ కలిగిన వైఖరిని కలిగి యుండవలెను. దేవుడు అనుకూలముగా ఉంటాడు మరియు మనలో ప్రతి ఒక్కరి జీవితములో అనుకూల విషయాలు జరగాలని ఆశిస్తాడు, కాబట్టి ఈరోజు మీరు నిరీక్షణతో నింపబడండి మరియు మేలుకరమైన విషయాలు జరగాలని సంతోషముగా ఎదురు చూడండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా జీవితములో మీ మేలును సంతోషముగా ఆశించుటకు ఈరోజు ఒక నిర్ణయము తీసుకొనుచున్నాను. నా నిరీక్షణ అధికమగుచున్నది, నా ఆనందము కూడా అధికమగునని నేను ఎరిగి యున్నాను. ప్రభువా, నీలో నా నిరీక్షణను ఉంచు చున్నాను!