
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. —కీర్తనలు 139:14
మనము భయముగా మరియు ఆశ్చర్యముగా రూపించబడ్డామని బైబిల్ చెప్తుంది. దేవుడు సమయాన్ని గడిపి మనలో ప్రతి ఒక్కరితో ఆయన సృజనాత్మకతను చూపించాడు, కాబట్టి ఆయన మనకు అన్నియు ఒకే విధంగా ఉండేటట్లు సృష్టించలేదనుటకు ఇదియే కారణం, అవునా?
దురదృష్టవశాత్తు, కొన్నిసార్లు మనము ఇతరులందరూ ఒకే విధముగా ఉన్నట్లు ప్రేమించుటకు ప్రయత్నిస్తాము.
మీ నుండి అందరూ అదే విషయం కోరుకొనరని మీరు తెలుసుకుంటారు. ఉదాహరణకు, మీ పిల్లల్లో ఒకరు మరొకరికంటే మీ వ్యక్తిగత సమయం నుండి ఎక్కువ సమయమును ఆశించవచ్చును. ఒక స్నేహితుడికి ఒకటి కన్నా ఎక్కువ రోజుల ప్రోత్సాహం అవసరమవుతుంది. కొందరు వ్యక్తులు కేవలం ప్రేమ యొక్క విభిన్న రీతుల అవసరమును కలిగి యుండవచ్చును.
వ్యక్తిగత ప్రాధాన్యతలను మరియు అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యమైనది. స్వార్థపూరితమైన ప్రజలు అందరు తన లాగానే ఉండాలని ఆశించేవారు, కానీ ప్రేమ ప్రజలలో తేడాలు గౌరవిస్తుంది. మనమందరం ఒకే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటే, మనలో ప్రతి ఒక్కరికి విభిన్న వ్రేలి ముద్రలు ఇచ్చేవాడు కాదు. వాస్తవంగా మనం సమానంగా సృష్టించబడ్డాము కానీ భిన్నముగా ఉన్నామనే రుజువును నేను నమ్ముతున్నాను.
మనకు వేర్వేరు బహుమతులు మరియు నైపుణ్యాలు, విభిన్న ఇష్టాలు మరియు అయిష్టాలు, జీవితంలోని వివిధ లక్ష్యాలు మరియు వివిధ ప్రేరణలు ఉన్నాయి. ప్రేమగల వ్యక్తి ఇతరులలో తేడాలు గౌరవిస్తాడు మరియు ప్రోత్సహిస్తాడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, ఇతరుల మధ్య వ్యత్యాసాలను అభినందించడానికి నాకు సహాయం చేసి, వాటికి అనుగుణంగా ప్రేమించుటకు నాకు సహాయం చేయుము. మనము కలుగ చేయబడిన విధము చూడగా అది భయమును మరియు ఆశర్యమును కలిగించుచున్నది. మరియు అద్భుతంగా చేసిన మీరు నా జీవితంలో ఉంచిన ప్రతి వ్యక్తి యొక్క అద్భుత సృష్టికి ధన్యవాదాలు.