…నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. —ఫిలిప్పీ 4:11
మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము సంతృప్తిగా ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంది. నేను ఏ పరిస్థితిలో ఉన్న ఎంత అవసరతలో ఉన్నాను నేను సంతృప్తిగా ఉండుట నేర్చుకొని యున్నానని అపొస్తలుడైన పౌలు రాశాడు.
సంతృప్తిగా ఉండుట అనునది మీరు ఇప్పటికే సంతోషముగా ఉండుటకు తీసుకునే నిర్ణయం. దురదృష్టవశాత్తు, దీర్ఘకాలంగా అసంతృప్త జీవితాలను గడుపుతూ, “ప్రభువా, నేను ఇకపై ఈ విధంగా నివసించను” అని చెప్తున్నాం. కానీ ఆ విధంగా ఉండవలసిన అవసరం లేదు.
మీరు ప్రతిరోజూ సంతృప్తిగా ఉండవలెనని ఎంచుకోవచ్చు. ఇది జీవితకాలంలో మీరు సంపాదించే అన్ని వస్తు సామగ్రి కంటే ఇది మరింత విలువైనది.
పౌలు 1 తిమోతి 6:6లో దీనిని సంతుష్టి సహితమైన దైవభక్తి (అంతర్గత సంతృప్తినిచ్చే వివేచనతో కూడుకున్నది) గొప్పలాభసాధనమై యున్నది, అని చెప్పుట ద్వారా స్పష్ట పరచాడు.
మనకు సంతోషం కలిగించడానికి ఖచ్చితంగా ఏమి కలిగి యుండవలెను? ప్రతిరోజు ప్రభువులో సంతృప్తిని ఎంచుకోవడం. “ప్రభువా, నీవు మాత్రమే నాకు కావలెనని నేను కోరుతున్నాను” అని దేవునితో పలుకుట నిజమైన శాంతి మరియు శాశ్వతమైన ఆనందాన్ని కలిగి ఉండే ఏకైక మార్గం.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నీవు నా నుండి ఆశించేదే నాకు అవసరమై యున్నది. అపొస్తలుడైన పౌలులాగే, నేను ప్రతి పరిస్థితుల్లోను సంతృప్తిగా ఉండుట ఎంపిక చేసుకుంటాను.