
యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. —కీర్తనలు 3:3
దేవుడు మీ కొరకు మంచి ప్రణాళికలను కలిగియున్నాడు మరియు మీరు అందులో ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు భార హృదయము, నిరాశ, మరియు నిరుత్సాహమనే ఆత్మతో జీవించుట ఆయనకు ఇష్టం లేదు. శుభవార్త ఎదనగా, మీరు దేవుని వైపు చూచుచు ఆయన మిమ్మును తల ఎత్తునట్లు చేయుటకు అనుమతించి యున్నట్లైతే మీ వైఖరి మీ బాహ్య రూపము మార్చబడుతుంది.
కీర్తనాకరుడు దేవుడు నా కేడెము, అతిషయాస్పదముగానూ మరియు నా తల ఎత్తు వాడవు గాను ఉన్నావని చెప్పి యున్నాడు. ఎవరైనా తమ తలను దించి నడుస్తున్నట్లైతే వారు చింత మరియు విచారముతో ఉన్నారని అనుకుంటాము. మీరు ఆ విధముగా భావిస్తున్నట్లైతే ఈరోజే దేవుడు మీ తలను మరియు మీ ఆత్మను ఎత్తుతాడని భావించండి.
దేవుడు మీకు నిరీక్షణ కలిగి యుండునట్లుగా మీ కొరకు ఒక మంచి ప్రణాళికను కలిగి యున్నాడని జ్ఞాపకముంచుకోండి. ఆయన మనతో, మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆయన చిత్తమును గురించి ఆలోచించవచ్చు లేక మాట్లాడ వచ్చును. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనము అనుకూలముగా ఉండుటకు అభ్యాసం చేయగలము. మన పరిస్థితులు మనకు సవాలు విసురుతున్నట్లైతే మరియు కష్టముగా ఉన్నట్లయితే, దేవుడు తన వాక్యములో మనకు వాగ్దానం చేసినట్లుగా వాటి నుండి మేలు కరమైన విషయాలను తీసుకొని రాగలడని ఎదురు చూడండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు నాకు అతిశయాస్పదముగాను మరియు నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. నీ వైపు చూచుటకు నేను ఎంపిక చేసుకొని యున్నాను. ఈరోజు మీ మంచి ప్రణాళికలు నా జీవితములో నెరవేర్చబడునట్లు నీ మీద దృష్టి యుంచుటకు మరియు నీ యందు నమ్మిక యుంచుటకు నాకు సహాయం చేయుము.