నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. —గలతీ 2:20
పౌలు తను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని చెప్పి యున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుని కొరకు జీవించాలంటే అతని గురించి ఆలోచించుట అతడు ఆపి వేయాలి. మరియు మనము దానిని చేయుటకు ప్రోత్సహించ బడుతున్నాము.
ఈ సమయంలో మీరు నా గురించి ఏమి? అని ఆలోచించ వచ్చును. నన్ను గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? అదియే మనము దేవుడు ఆశించిన రీతిగా మనము జీవించకుండా మనకు అడ్డుపడుతుంది.
మనము కోరినది, ఆలోచించినది మరియు భావించిన దానిని గురించి ఆలోచించుట చాల సులభం, కానీ మీ కొరకు జీవించుట అనునది విసుగు పుట్టించే మరియు ఖాళీ మార్గమై యున్నది. దేవుని మీద దృష్టి యుంచుట చాల అద్భుతమైనది మరియు మనము కోరినది మరియు అవసరమైన దానిని కలిగి యుండుటలోని భయమునుండి అది మనలను విడిపిస్తుంది.
ఆనందమును కలిగి యుండుటలోని రహస్యమేదనగా మీ జీవితమును దాచి పెట్టుకొనుట కంటే అంకింతం చేయుటయే. మీరు మీ మీద నుండి మీ దృష్టిని దేవుని వైపు మళ్లించిన యెడల, మీరు నిజమైన అర్ధవంతమైన జీవితమును ఎలా జీవించాలో ఆయన మీకు చూపించ గలడు.
మిమ్మును మీరు దేవునికి సమర్పించుట ద్వారా మీ దినములను ప్రారంభించమని మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. మీరు దీనిని చేసినప్పుడు, మీరు దైవిక జీవితమును జీవించుటకు ఆయన మీకు నమ్మకముగా సహాయం చేయును.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను నా నేత్రములను, చెవులను, నోటిని, చేతులను, కళ్ళను, ఆర్ధిక వనరులను, వరములను, తలాంతులను, సామర్ధ్యములను, శక్తిని – నాకు కలిగిన సమస్తమును నీకు సమర్పించుచున్నాను! నేను నాకొరకు జీవించాలని ఆశించుట లేదు – నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను.