నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను —యెషయా 43:25
మీతో మీరు సంబంధమును కలిగి యున్నారని మీకెప్పుడైన అనిపించిందా? మీకు ఆ ఆలోచన ఎప్పుడూ వచ్చి యుండక పోవచ్చు, కానీ మీరు మరే ఇతర వ్యక్తుల కంటే మీతో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు మరియు మీతో మీరు మంచి సంబంధమును కలిగి యుండుట చాల ప్రాముఖ్యమైనది ఎందుకనగా, మీ నుండి దూరముగా వెళ్ళని ఒకే ఒక వ్యక్తి మీరే.
మనం స్వార్థపూరితమైన జీవనశైలిని కలిగించే స్వార్థపూరిత, స్వీయ ఆధారిత మార్గంలో కాక దేవుని సృష్టిని ఉత్తమమైనదిగా, సరైనదిగా ఉంచేలా సమతులంగా, దైవిక మార్గంలో ఉండునట్లు – మనల్ని మనం ప్రేమించాలి. ఎవరూ పరిపూర్ణులు కారు మరియు మనము దురదృష్టకరమైన అనుభవాల ద్వారా వెళ్తున్నాము కానీ దాని అర్ధం మనము యోగ్యత లేనివారమని మరియు పనికిరాని వారమని కాదు.
మనము ఈ విధంగా పలికే ప్రేమ గలవారమై యుండవలెను, “దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు, కాబట్టి ఆయన ఎన్నుకొన్న ప్రేమ ద్వారానే నేను ప్రేమించగలను. నేను చేసే సమస్తమును నేను ప్రేమించను కానీ దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు కనుక నన్ను నేను అంగీకరిస్తున్నాను”. మనము ఇలా పలికే పరిపక్వత గల ప్రేమను కలిగి యుండవలెను, “దేవుడు నన్ను అనుదినము మారుస్తున్నాడని నేను నమ్ముతున్నాను, కానీ ఈ ప్రక్రియలో దేవుడు అంగీకరించే దానిని నేను తృణీకరించను. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే నేను ఉండబోనని తెలుసుకుంటూ అలాగే నేను అంగీకరిస్తున్నాను.”
ప్రారంభ ప్రార్థన
దేవా, యెషయా 43:25 లో చెప్పబడినట్లుగా నీవు నా అతిక్రమములన్నిటినీ తుడిచి వేసి నన్ను అంగీకరించి యున్నావు మరియు దీని అర్ధమేదనగా నన్ను నేను తృణీకరించనవసరం లేదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు గనుక నన్ను నేను ప్రేమించుటకు నేను స్వతంత్రురాలిని!