మీరు అర్హత లేని దానిని పొందుట

మీరు అర్హత లేని దానిని పొందుట

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. –కీర్తనలు 40:1-2

ఎక్కువమంది ప్రజలు తమకు తాము అర్హులైతేనే వారికి సహాయం చేయటానికి దేవునిని అనుమతిస్తారు. ఒకసారి నేను నా జీవితంలో ఆ విధంగానే ఉన్నాను. నేను సంపాదించియున్నానని ఆలోచించినప్పుడు మాత్రమే దేవుడు నాకు సహాయం చేస్తాడని సంవత్సరాలు గడిపాను, నేను ఆయన సహాయం పొందటం కోసం తగినంత మంచి పనులను చేశానని అనుకున్నాను.

ఆ విధమైన ఆలోచన కృతజ్ఞత మరియు కృతజ్ఞతయనే వైఖరిని పుట్టించదు. మనకు లభించే దానికి అర్హులమని మనకు అనిపిస్తే, అది ఇకపై బహుమానం కాదు, కానీ ఒక జీతం లేదా “అన్వయింపబడిన సేవలకు చెల్లింపు.” మనకు అర్హతలేని దానిని పొందుటకు మరియు మనము పొందుకోవలసిన దానిని పొందుటకు మధ్య ఉన్న వ్యత్యాసమేదనగా కృప మరియు క్రియలకు ఉన్న తేడా.

మీ హృదయాన్ని తెరిచి, దేవుని దయ మీ జీవితంలోకి రావటానికి మీ దైనందిన నడకలో మీకు సహాయం చేయుమని నేను మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. ఎల్లవేళలా మీరు నిరాశకు గురైనప్పుడు, మీరు మీ స్వంత కృషి ద్వారా జీవిస్తున్నారని మరియు ఆయన ద్వారా మీరు కృషి చేయటానికి అనుమతించటం ద్వారా దేవుని కృపలోకి తిరిగి వస్తారు.

దేవుడు మీకు సహాయం చేస్తాడని తెలుసుకోండి. దేవుని సహాయాన్ని పొందుటకు ప్రయత్నించవద్దు మరియు ఆయన మీ ప్రతి అవసరాన్నిఅందించడానికి అనుమతించండి.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను అర్హురాలిగా ఉన్నప్పుడు మాత్రమే మీ సహాయం అంగీకరించడం యొక్క అవివేకమును గ్రహించియున్నాను. నేను నా స్వంత పనులను వదిలివేసి, నీ కృపను స్వీకరించాను. ప్రతి సందర్భంలోనూ నేను అర్హత లేనప్పటికీ నాకు సహాయపడుచున్నందుకు ధన్యవాదాలు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon